- Telugu News Photo Gallery Cinema photos Actress Malavika Nair Role Revealed In Prabhas's Kalki 2898 AD Movie telugu movie news
Kalki 2898 AD: అరెరే.. ఈ బ్యూటీ గురించి చెప్పలేదే.. కల్కి ట్రైలర్ చూసేంతవరకు తెలియలేదుగా..
భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు రాబోతుంది కల్కి 2898 ఏడీ. ఈ సినిమాలో పలు అతిథి పాత్రలున్నాయని వైజయంతీ నెట్ వర్క్ ముందు నుంచి చెప్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రమోషన్లలో ఒక్కొక్కరి పాత్రను రివీల్ చేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్లో ఓ హీరోయిన్ను చూపించి సర్ ప్రైజ్ చేసింది మూవీ టీం.
Rajitha Chanti | Edited By: Rajeev Rayala
Updated on: Jun 22, 2024 | 2:51 PM

భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు రాబోతుంది కల్కి 2898 ఏడీ. ఈ సినిమాలో పలు అతిథి పాత్రలున్నాయని వైజయంతీ నెట్ వర్క్ ముందు నుంచి చెప్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రమోషన్లలో ఒక్కొక్కరి పాత్రను రివీల్ చేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్లో ఓ హీరోయిన్ను చూపించి సర్ ప్రైజ్ చేసింది మూవీ టీం.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మాళవిక నాయర్. గతంలో వైజయంతీ నెట్ వర్క్ బ్యానర్ పై తెరకెక్కించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. అలాగే మహానటి సినిమాలో కీలకపాత్రలు పోషించింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూడు చిత్రాల్లో మాళవిక నాయర్ కనిపించడం విశేషం.

అలాగే వైజయంతి నెట్ వర్క్ తెరకెక్కించిన అన్నీ మంచి శకునములే చిత్రంలోనూ కనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన కల్కి సెకండ్ ట్రైలర్లో మాళవిక కనిపించింది. ఆమె లుక్ స్క్రీన్ షాట్ తీసి అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆనందం వ్యక్తం చేసింది మాళవిక. వాటిని తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ థాంక్స్ చెప్పింది.

నాగ్ అశ్విన్ భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న కల్కి చిత్రంలో దీపికా, దిశా పటానీ, ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ నటిస్తుండగా.. ఇటీవలే అలనాటి హీరోయిన్ శోభన పాత్రను రివీల్ చేశారు. అలాగే ఇప్పుడు సెకండ్ ట్రైలర్ లో మృణాల్ కనిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మాళవిక కనిపించింది.

అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ గమనిస్తే ఈ సినిమాలో మాళవిక అభిమన్యుడి భార్య ఉత్తర పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అశ్వత్తామ, అర్జునుడి భీకర యుద్ధం, బ్రహ్మాస్త్రాలను ప్రయోగించే సీన్ చూపించారు. ప్రస్తుతం మాళవిక నాయర్ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.





























