కీర్తి సురేష్ ప్రధానంగా తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలలో కథానాయకిగా నటిస్తుంది. తెలుగులో నేను శైలజ చిత్రంతో అరంగేట్రం చేసిన కీర్తి సురేష్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ఒక నేషనల్ ఫిల్మ్ అవార్డు, నాలుగు SIIMA అవార్డులు, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్‌తో సహా పలు ప్రశంసలు అందుకుంది. 2021లో ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో కీర్తి స్థానం పొందింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు లైక్స్ కొడుతూ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.