- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Fame Shobha Shetty Gifts Beast XUV 700 Car To Her To Be Husband Yashwanth, Shares photos
Shobha Shetty: కాబోయే భర్త బర్త్‌డే.. కాస్ట్‌లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన బిగ్ బాస్ ‘శోభా శెట్టి’.. ఫొటోస్
గతేడాది బిగ్‌బాస్ 7వ సీజన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ శోభా శెట్టి. ఇందులో అమర్ దీప్, ప్రియాంకలతో కలిసి ఆమె చేసిన హంగామా ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ముఖ్యంగా శివాజీ, ప్రశాంత్ టీమ్ తో సై అంటే సై అందీ అందాల తార.
Updated on: Jun 22, 2024 | 12:32 PM

1. గతేడాది బిగ్‌బాస్ 7వ సీజన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ శోభా శెట్టి. ఇందులో అమర్ దీప్, ప్రియాంకలతో కలిసి ఆమె చేసిన హంగామా ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ముఖ్యంగా శివాజీ, ప్రశాంత్ టీమ్ తో సై అంటే సై అందీ అందాల తార.

అంతకు ముందు బుల్లితెర జనాల ఫేవరెట్ సీరియల్ 'కార్తీకదీపం'లో మోనిత అనే విలన్ పాత్రలో ఆకట్టుకుంది శోభా శెట్టి. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టిందీ ముద్దుగుమ్మ.

కాగా శోభా శెట్టి త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనుంది. తన ప్రియుడు యశ్వంత్ తో కలిసి పెళ్లిపీటలెక్కనుంది. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు సమాచారం.

కార్తీక దీపం సీరియల్లో కలిసి నటించారీ ప్రేమపక్షులు. ఆ తర్వాత పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. షార్ట్ ఫిల్మ్స్ చేసిన సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది.

ప్పుడు తనకు కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా కాస్ట్ లీ కారుని అతనికి గిఫ్ట్‌గా ఇచ్చింది శోభా శెట్టి. బీస్ట్ ఎక్స్‌యూవీ 700 కారుని శోభాశెట్టి కొనుగోలు చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

మార్కెట్‌లో ఈ లగ్జరీ కారు ధర సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఉంటుందని సమాచారం. మొత్తానికి ప్రియుడి పుట్టిన రోజుకు కాస్ట్లీ కారునే గిఫ్ట్ గా ఇచ్చింది శోభ.





























