AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darshan: దర్శన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్.. హీరోకు ఆ సమస్యలు ఉన్నాయంటూ..

ఈ కేసులో దర్శన్ A2 గా ఉండగా, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ A1 నిందితురాలిగా ఉన్నారు. వీరిద్దరితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 10వ తేదీన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయ్యాక దర్శన్‌ మానసిక పరిస్థితి చర్చకు వచ్చింది. దీనికి సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Darshan: దర్శన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్.. హీరోకు ఆ సమస్యలు ఉన్నాయంటూ..
Darshan
Basha Shek
|

Updated on: Jun 23, 2024 | 1:13 PM

Share

కర్ణాటకలో సంచలనం రేపిన రేణుకాస్వామి హత్య కేసులో స్టార్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జులై 4 వరకు ఆయన పరప్పన అగ్రహారం జైలులో ఉండనున్నారు. ఈ కేసులో దర్శన్ A2 గా ఉండగా, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ A1 నిందితురాలిగా ఉన్నారు. వీరిద్దరితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 10వ తేదీన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయ్యాక దర్శన్‌ మానసిక పరిస్థితి చర్చకు వచ్చింది. దీనికి సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శన్‌కు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తగిన వైద్యం అవసరమని ఆయనను పరీక్షించిన వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కాగా గతంలో దర్శన్ పలు సార్లు, పలువురితో గొడవలకు దిగాడు. సినిమా షూటింగుల్లోనూ ఇతరులను కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయని గతంలో దర్శన్‌కు కౌన్సిలింగ్‌ ఇచ్చిన మానసిక వైద్యురాలు చంద్రిక చెబుతున్నారు.

దర్శన్ కు చిన్నచిన్న విషయాలకు కూడా అతిగా స్పందించే అలాటు ఉందని, పట్టరాని కోపం తో ఇతరులపై చేయి చేసుకునే వాడని వైద్యులు చెబుతున్నారు. అయితే అతని స్టార్ డమ్, క్రేజ్ కారణంగా ఇవన్నీ పక్కకు వెళ్లిపోయాయంటున్నారు. దర్శన్‌ కు కౌన్సెలింగ్‌ కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. అయితే మరోవైపు బెయిల్‌ కోసమే దర్శన్‌ ఆరోగ్య సమస్యలు, మానసిక పరిస్థితి బాగులేదనే కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మానసిక పరిస్థితి బాగోలేదనే ప్రభుత్వ వైద్యులు ధృవీకరిస్తే తప్పకుండా దర్శన్‌కు బెయిల్‌ వచ్చే అవకాశం ఉందని పలువురు న్యాయవాదులు కూడా అభిప్రాయపడుతున్నారు. బెయిల్‌ కోసమే ఇలా కొత్త డ్రామాను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే