- Telugu News Photo Gallery Cinema photos Ram Charan Daughter Mega Princess Klin Kaara Photos goes trending in social media Telugu Heroines Photos
Klin Kaara: ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లింకారా పేస్ రివీల్.. ట్రెండింగ్‌లో ఫొటోస్..
తాజాగా మొదటి పుట్టినరోజు జరుపుకొన్న మెగా హీరో రామ్‌చరణ్-ఉపాసన దంపతుల కుమార్తె క్లీంకారకు శుభాకాంక్షలు వెల్లువెత్తయి. చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులతోపాటు మెగా అభిమానులు శుభాకాంక్షలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె తన ముద్దుల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
Updated on: Jun 23, 2024 | 9:31 PM

తాజాగా మొదటి పుట్టినరోజు జరుపుకొన్న మెగా హీరో రామ్‌చరణ్-ఉపాసన దంపతుల కుమార్తె క్లీంకారకు శుభాకాంక్షలు వెల్లువెత్తయి.

చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులతోపాటు మెగా అభిమానులు శుభాకాంక్షలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె తన ముద్దుల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

క్లీంకార రాకతో తమ జీవితాలు పరిపూర్ణమయ్యాయని పేర్కొన్నారు. ఈ వీడియోను తాను ఇప్పటి వరకు మిలియన్ సార్లు చూసినట్టు తెలిపారు.

తమ జీవితాల్లో ఆనందం నింపినందుకు క్లీంకారకు ధన్యవాదాలు చెప్పారు. ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్, ఉపాసన సహా పలువురు కుటుంబ సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

క్లీంకార తమ కుటుంబంలోకి రావడానికి ముందు, ఆమె గురించి తామెంతలా ఎదురుచూసారో అందులో చెప్పుకొచ్చారు. ఈ వీడియోలోనే చెర్రీ-ఉపాసన పెళ్లి, క్లీంకార నామకరణ వేడుకకు సంబంధించిన దృశ్యాలు కూడా ఉన్నాయి.




