Bhaje Vaayu Vegam OTT: అఫీషియల్ ప్రకటన.. ఆరోజు నుంచే ఓటీటీలో కార్తికేయ భజే వాయు వేగం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మే 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. క్రికెట్ బెట్టింగ్ కు యాక్షన్ నేపథ్యాన్ని జోడించి డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి భజే వాయు వేగం సినిమాను తెరకెక్కించారు. ఇందులో కార్తికేయకు జోడీగా ఐశ్వర్య మీనన్ నటించారు. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్, శరత్ లోహితస్వ, తనికెళ్ల భరణి, రవిశంకర్, సుదర్శన్, కీరోల్స్ చేశారు

Bhaje Vaayu Vegam OTT: అఫీషియల్ ప్రకటన.. ఆరోజు నుంచే ఓటీటీలో  కార్తికేయ భజే వాయు వేగం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Bhaje Vaayu Vegam Movie
Follow us
Basha Shek

|

Updated on: Jun 24, 2024 | 8:32 PM

యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ సినిమా భజే వాయు వేగం. బెదురులంక వంటి సూపర్ హిట్ తర్వాత రిలీజైన ఈ సినిమా కూడా అభిమానుల అంచనాలను అందుకుంది. మే 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. క్రికెట్ బెట్టింగ్ కు యాక్షన్ నేపథ్యాన్ని జోడించి డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి భజే వాయు వేగం సినిమాను తెరకెక్కించారు. ఇందులో కార్తికేయకు జోడీగా ఐశ్వర్య మీనన్ నటించారు. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్, శరత్ లోహితస్వ, తనికెళ్ల భరణి, రవిశంకర్, సుదర్శన్, కీరోల్స్ చేశారు. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన భజే వాయు వేగం నెల తిరిగే లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కార్తికేయ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన విడుదలైంది. జూన్ 28వ తేదీ నుంచి భజే వాయు వేగం సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ‘రహస్యాలు, చేజ్‍లు, గ్యాంబ్లింగ్, ఇంకా మాఫియా.. ఇవేవీ వెంకట్ గాడికి సరిపోవు. భజే వాయువేగం సినిమాను జూన్ 28 నుంచి నెట్‍ఫ్లిక్స్‌ లో చూడండి’ అని ట్వీట్ చేసింది ఓటీటీ దిగ్గజ సంస్థ. అలాగే సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై భజే వాయు వేగం సినిమా తెరకెక్కింది. రదన్ ఈ సినిమాకు స్వరాలు అందించగా.. కపిల్ కుమార్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మరి థియేటర్లలో భజే వాయు వేగం సినిమాను మిస్ అయ్యారా? లేక మళ్లీ ఈ సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే ఒక నాలుగు రోజులు వెయిట్ చేయండి. ఎంచెక్కా ఓటీటీలోకే రానుంది. ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరో 4 రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

Behind every adrenaline-packed action there’s an equally strong emotion driving it 🚘💥

Experience it with #BhajeVaayuVegam in theaters today ❤️‍🔥 🎟️ https://t.co/1fXhjRwRvN #BVVInCinemasNow pic.twitter.com/E0420aVOJe

— Kartikeya (@ActorKartikeya) June 5, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!