AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: 17 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి సూపర్ హిట్ హారర్​ కామెడీ మూవీ

కొన్ని సినిమాలు ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలా రీసెంట్​గా వచ్చిన మూవీ ముంజ్యా. ఈ దర్శకుడే తీసిన కాకుడా అనే మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతుంది ఆ డీటేల్స్ తెలుసుకుందాం...

OTT: 17 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి సూపర్ హిట్ హారర్​ కామెడీ మూవీ
OTT
Ram Naramaneni
|

Updated on: Jun 25, 2024 | 5:56 PM

Share

కంటెంట్ బాగుంటే చాలు భాషా భేదం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు జనాలు. సినిమాలు మాత్రమే కాదు కొరయన్ సిరిస్‌లను కూడా వదలడం లేదు. కాగా మన దగ్గర కొన్ని సినిమాలు ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై ఆడియెన్స్‌ సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. అలా ఇటీవల రిలీజై బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన చిత్రం.. ముంజ్యా. హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. కేవలం 17 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. మూవీ యూనిటే ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీకి గ్రాస్ కలెక్షన్స్ .103 కోట్లు కాగా.. నెట్ కలెక్షన్స్ రూ.87.35 కోట్లు వచ్చాయి. విడుదలైన తొలి రోజే.. రూ.4 కోట్ల ఓపెనింగ్​ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ.. తొలి సారి వసూళ్ల సునామి క్రియేట్ చేస్తూ.. రూ.36.5 కోట్లు వసూలు చేసింది. రెండో వారం కూడా జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఏకంగా 32 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మూడో వారం కూడా అదే ఊపు కంటిన్యూ అవుతుంది.

ఈ క్రమంలో మూవీ యూనిట్ ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపింది. ‘ముంజ్యా నవ్విస్తూ, భయపెడుతూ.. రూ.100 కోట్లు వసూళ్లు రాబట్టింది. మీ ప్రేమ, అభిమానం వల్లే ఇది సాధ్యమైంది. ఈ విజయంలో బాగామైన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్’ అని యూనిట్ తెలిపింది. మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోదర్​ ఈ మూవీ డైరెక్ట్ చేశారు. ముంజ్యా అనేది ఓ వింత జీవి.. ఓ వ్యక్తి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. కాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ డిస్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్‌లో అలరిస్తున్న మూవీ.. మరో రెండు నెలలు ఓటీటీలోకి వచ్చే అవకాశాలు లేవు. కానీ మాంజ్యా  మూవీ దర్శకుడే తెరకెక్కించిన ‘కాకుడా’ అనే మరో హారర్ కామెడీ మూవీ జీ5 ఓటీటీ వేదికగా జులై 12 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!