Emergency Movie: ఇందిరా గాంధీగా ఎంపీ కంగన.. ‘ఎమర్జెన్సీ’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

ఇన్నాళ్లు సినీ నటిగా, దర్శకురాలిగా అందరి దృష్టిని ఆకర్షించిన కంగనా ఇకపై ఎంపీగా ప్రజలకు సేవ చేయనుంది. కాగా కంగనా ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ సినిమాలో నటించింది. అయితే ఎన్నికల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది

Emergency Movie: ఇందిరా గాంధీగా  ఎంపీ కంగన.. 'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Kangana Ranaut's Emergency
Follow us
Basha Shek

|

Updated on: Jun 25, 2024 | 5:28 PM

ప్రముఖ బాలీవుడ్ నటి, దర్శకురాలు కంగనా రనౌత్ ఇప్పుడు బీజేపీ ఎంపీ. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె భారీ మెజార్టీతో గెలుపొందింది. ఇన్నాళ్లు సినీ నటిగా, దర్శకురాలిగా అందరి దృష్టిని ఆకర్షించిన కంగనా ఇకపై ఎంపీగా ప్రజలకు సేవ చేయనుంది. కాగా కంగనా ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ సినిమాలో నటించింది. అయితే ఎన్నికల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడీ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 6న ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు కంగనా. కంగనా ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ సినిమా విడుదలవుతుందా లేదా అనే సందేహం నెలకొంది. అయితే ఎట్టకేలకు కంగనా సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాలో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో నటించింది. మాజీ ప్రధానిలోని దృఢమైన వ్యక్తిత్వాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించామని కంగనా అంటున్నారు.

ఇవి కూడా చదవండి

భారత రాజ్యాంగంలో చీకటి అధ్యాయం గా పేరొందిన ఎమర్జెన్సీ రోజును (జూన్ 25) ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు కంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ఆమెనే దర్శకత్వం వహించారు. అలాగే నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇదిలా ఉంటే కంగనా రనౌత్ గత కొన్ని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పరాజయం పాలయ్యాయి. ఈ సినిమా ద్వారా కంగనా మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందని అంటున్నారు. అలాగే, బీజేపీ ఎంపీగా కంగనా ఇందిరాగాంధీని, ఎమర్జెన్సీని తెరపై ఎలా చిత్రీకరిస్తుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. చాలా నెలల క్రితం ఈ సినిమా చిన్న టీజర్ విడుదలైంద., టీజర్‌లో కంగనా రనౌత్ నటన అద్భుతంగా ఉంది. ఆ ఒక్క చిన్న టీజర్ నుంచే సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. త్వరలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.

ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనౌత్ లుక్..

ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న కంగనా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.