AUS vs IND T20 WC Result: బదులు తీర్చుకున్న భారత్.. ఆసీస్‌ను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లిన రోహిత్ సేన

Australia vs India Result, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో  టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. సూపర్‌-8 పోరులో భాగంగా సోమవారం (జూన్ 24)న జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాను భారత్‌ 24 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్‌ శర్మ (92) దంచికొట్టాడు

AUS vs IND T20 WC Result: బదులు తీర్చుకున్న భారత్.. ఆసీస్‌ను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లిన రోహిత్ సేన
Team India
Follow us
Basha Shek

|

Updated on: Jun 25, 2024 | 12:01 AM

Australia vs India Result, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో  టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. సూపర్‌-8 పోరులో భాగంగా సోమవారం (జూన్ 24)న జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాను భారత్‌ 24 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్‌ శర్మ (92) దంచికొట్టాడు.  అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ నిర్ణీత  20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎప్పటిలాగానే ఓపెనర్ ట్రావిస్ హెడ్ (74) చెలరేగాడు. అయితే  భారత బౌలర్లు విజృంభించడంతో ఆఖరిలో వరుసగా వికెట్లో కోల్పోయింది ఆసీస్. దీంతో విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచిపోయింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్‌ 3, కుల్దీప్‌ 2, అక్షర్‌, బుమ్రా ఒక వికెట్‌ తీశారు.  ఈ విజయంలో టీమిండియా సెమీస్ బెర్తు ఖరారైంది. మరోవైపు ఈ  ఓటమితో ఆసీస్‌ సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై ఆసీస్ సెమీస్ అవకాశాలు ఆధార పడి ఉన్నాయి.

అజేయంగా సెమీస్ కు టీమిండియా..

ఇక రెండు అడుగుల దూరంలో టీ 20 ప్రపంచ కప్..

ఇరు జట్ల వివరాలివే.

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ(కెప్టెన్ ), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):
ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్(కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..