Athidhi : ‘అతిథి’ లో హీరోయిన్ చెల్లిగా చేసిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
‘పోకిరి’ తర్వాత మహేష్ బాబుని మూడు ప్లాపులు పలకరించాయి. అందులో ‘అతిథి’ ఒకటి. 2007 అక్టోబర్ 18న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ‘అతిథి’ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అమృత రావు నటించింది. ఇక ఆమె చెల్లెలిగా ఓ పాప కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఈ పాప చనిపోవడం అనేది ప్రేక్షకులకు నచ్చలేదు. ఆ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం పదండి...
టాలీవుడ్‌లో క్లాసిక్ డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డికి పేరుంది. అయితే బ్లాక్ బాస్టర్.. లేదంటే అట్టర్ ప్లాఫ్. ప్రముఖ దర్శకుడు.‘కిక్’ సినిమాతో భారీగా వసూళ్లు రాబట్టాడు. మహేశ్ బాబుతో సురేంద్ర రెడ్డి తీసిన అతిథి సినిమా అభిమానులను నిరాశపరిచింది. అయితే సినిమాలోని కొన్ని రోల్స్ మాత్రం ఆడియెన్స్‌కు ఇప్పటికీ గుర్తుంటాయి. అందులో హీరోయిన్ చెల్లెలు పాత్ర కూడా ఒకటి. తన పేరు కర్మన్ సింధు. అతిథి తనకి మొదటి సినిమా అయినప్పటికీ… కెమెరా ఫియర్ లేకుండా.. ఎంతో బాగా యాక్ట్ చేసి అందరి ప్రశంసలు అందుకుంది సింధు. అన్ని రకాల ఎమోషన్స్ పండించి.. మంచి ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకుంది. క్లైమాక్స్‌లో సింధూ పాత్ర చనిపోవడంతో ప్రేక్షకులను ఊసూరుమంటారు. తెలుగు సినిమాల్లో శాడ్ ఎండింగ్ ఉండే ప్రేక్షకులు అంతగా ఒప్పరు. అయినా సురేంద్రరెడ్డి రిస్క్ చేశాడు. ఫలితం తేడా కొట్టింది. అతిథి తర్వాత సింధు మరో సినిమా చేయలేదు. ఆమెకు సినిమా ఇండస్ట్రీపై అంత ఇంట్రస్ట్ లేదట.
కాగా ఇప్పుడు సింధు ఏం చేస్తుంది.. ఎలా ఉంది అని తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అందుకే మేము కొంత సమాచారం సేకరించాం. కర్మన్ సంధు కెరీర్ కౌన్సెలింగ్, గైడెన్స్, అసెస్‌మెంట్‌లో కాన్సిలర్‌గా సేవలందిస్తోంది. ఆమె ఇటీవలి ఫోటోలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాం. దిగువన చూడండి…
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.