Renu Desai: ‘నా కూతురు ఏడుస్తూనే ఉంది.. మీకు ఈ తల్లి శాపం కచ్చితంగా తగులుతుంది’.. రేణు దేశాయ్ ఆగ్రహం
పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్, నెటిజన్ల మధ్య గత కొన్ని రోజులుగా ఒక మినీ యుద్ధమే జరుగుతోంది. కొందరు నెటిజన్లు అదే పనిగా రేణు దేశాయ్, ఆమె పిల్లలు ఆద్య అకీరా నందన్ లను టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ చేస్తున్నారు. వీటికి ఎప్పటికప్పుడు గట్టిగా బదులిస్తోంది రేణు దేశాయ్. అయినా ఈ ట్రోల్స్ , మీమ్స్ ఆగట్లేదు.
పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్, నెటిజన్ల మధ్య గత కొన్ని రోజులుగా ఒక మినీ యుద్ధమే జరుగుతోంది. కొందరు నెటిజన్లు అదే పనిగా రేణు దేశాయ్, ఆమె పిల్లలు ఆద్య అకీరా నందన్ లను టార్గెట్ చేస్తూ నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ చేస్తున్నారు. వీటికి ఎప్పటికప్పుడు గట్టిగా బదులిస్తోంది రేణు దేశాయ్. అయినా ఈ ట్రోల్స్ , మీమ్స్ ఆగట్లేదు. ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన భార్య అన్నా లెజినోవాతో అకీరా నందన్, ఆద్యలతో కలిసి సరదాగా ఒక ఫొటో దిగారు. అయితే, ఈ ఫొటోపై కూడా కొందరు సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ చేశారు. దీంతో రేణు దేశాయ్ కోపం కట్టలు తెంచుకుంది. ‘మనుషులు ఇంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు’ అంటూ ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. తన తల్లి గురించి ఇష్టమొచ్చినట్టుగా రాసిన కామెంట్లు, మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చిందని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది
‘నేను ఈ ఫొటోను ఎలా క్రాప్ చేస్తానో.. ఎలా పోస్ట్ చేస్తానో అంటూ జోక్‍లు వేస్తూ.. మీమ్స్ తయారు చేస్తున్న భయానక కఠినమైన వ్యక్తులు అందరూ మీకు కూడా ఒక కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోండి. నా కుమార్తె (ఆద్య) ఇన్‍స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు ఒక మీమ్ పేజీ కనిపించింది. అందులో తన తల్లిని ఎగతాళి చేయడాన్ని చూసి తీవ్రంగా ఏడ్చింది. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే వారంతా ఒక్కసారి మీ ఇళ్లలోనూ తల్లులు, అక్కాచెల్లెళ్లు ఉన్నారని గుర్తుంచుకోండి. మాపై అభ్యంతరకరంగా మీమ్స్, జోక్స్ వేసున్న వారికి ఈ తల్లి శాపం తగులుతుంది. నా బిడ్డ ఈరోజు అనుభవించిన బాధ, కార్చిన కన్నీరుతో మీకు చెడు కర్మ కచ్చితంగా తగులుతుందని గుర్తుంచుకోండి. పోలెనా, మార్క్ (పవన్ – లెజినోవా పిల్లలు) కూడా ఈ మీమ్స్, కఠినమైన కామెంట్లతో ప్రభావితులవుతారు. అతి భయకమైన మనుషులుగా తయారైన మీమ్ పేజ్ అడ్మినిస్ట్రేటర్లందరికీ ఈ తల్లి శాపం తగులుతుంది. నేను దీన్ని పోస్ట్ చేసే ముందు 100సార్లు ఆలోచించాను. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వచ్చింది” అని రేణు దేశాయ్ తన ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.
రేణూ దేశాయ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.