Tollywood: ఈ చిన్నారిని గుర్తు పట్టారా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ధ్రువ తార.. 32 ఏళ్లకే కన్నుమూసింది

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ధ్రువ తారలా వెలుగొందింది. అయితే ఈ అందాల తార ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేరు. కానీ ఆమె నటించిన సినిమాలు, పోషించిన పాత్రల రూపంలో ఎల్లప్పుడూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయింది.

Tollywood: ఈ చిన్నారిని గుర్తు పట్టారా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ధ్రువ తార.. 32 ఏళ్లకే కన్నుమూసింది
Tollywood Actress Childhood Photo
Follow us
Basha Shek

|

Updated on: Jun 26, 2024 | 8:47 AM

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ధ్రువ తారలా వెలుగొందింది. అయితే ఈ అందాల తార ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేరు. కానీ ఆమె నటించిన సినిమాలు, పోషించిన పాత్రల రూపంలో ఎల్లప్పుడూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయింది. ఈ హీరోయిన్ చనిపోయి చాలా ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమెను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. టీవీల్లో ఆమె సినిమాలు వచ్చినప్పుడల్లా తనకు ఇంత త్వరగా మరణం రావాల్సి ఉండాల్సింది కాదంటారు. ఇలా అభిమానులతో అభినవ సావిత్రిగా ప్రశంసలు పొందిన ఈ అమ్మాయి ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది.. యస్. మీరు ఊహించింది కరెక్టె.. ఆమె మరెవరో కాదు సౌందర్య. ఇది ఆమె చిన్న నాటి ఫొటో.

తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సౌందర్య. చాలా మంది లాగే డాక్టర్ కావాల్సిన ఈ అమ్మాయి.. హీరోయిన్ గా మారింది. తన నటనా చాతుర్యంతో అనతి కాలంలోనే కోట్లాది మంది అభిమానులును సొంతం చేసుకుంది. చక్కటి చీరకట్టులో.. నిండైన రూపంతో పదహారణాల తెలుగింటి అమ్మాయిగా తెలుగు ఆడియెన్స్ ను అలరించింది.   ఒక్క తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. సుమారు దశాబ్ద కాలం పాటు వెండితెరపై సందడి చేసిన ఈ అందాల తార అనుకోని ప్రమాదంలో కన్ను మూసింది. 2004లో జరిగిన ఓ హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె సోదరుడు కూడా కన్ను మూశారు. అప్పటికే ఆమెకు పెళ్లయింది. రెండు నెలల గర్భవతి కూడా. కానీ హెలికాప్టర్ ప్రమాదం సౌందర్య కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కానీ ఆమె నటించిన సినిమాలు, పోషించిన పాత్రల రూపంలో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిందీ అందాల తార.

Soundarya

Soundarya

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే