Pritviraj Sukumaran: ఖరీదైన కారు కొన్న సలార్ నటుడు.. పృథ్వీరాజ్ కొత్త కారు ధర తెలిస్తే గుండె గుభేల్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ సినిమాలో పృథ్వీ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ హీరో. సలార్ తర్వాత పృథ్వీరాజ్ నటించిన ది గోట్ లైఫ్ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇదే మూవీని తెలుగులో ఆడు జీవితం పేరుతో రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా పృథ్వీరాజ్ గ్యారేజీలోకి మరో ఖరీదైన కారు వచ్చి చేరింది.
మలయాళీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. విభిన్నమైన సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలోనూ పృథ్వీకి మంచి పాలోయింగ్ ఉంది. ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన పృథ్వీరాజ్.. ఇప్పుడు విలన్ పాత్రలో మెప్పించేందుకు రెడీ అయ్యారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ సినిమాలో పృథ్వీ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ హీరో. సలార్ తర్వాత పృథ్వీరాజ్ నటించిన ది గోట్ లైఫ్ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇదే మూవీని తెలుగులో ఆడు జీవితం పేరుతో రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా పృథ్వీరాజ్ గ్యారేజీలోకి మరో ఖరీదైన కారు వచ్చి చేరింది.
పృథ్వీరాజ్కు ఆటోమొబైల్స్ పై విపరీతమైన ఇష్టం ఉంది. ఇప్పటికే ఈహీరో వద్ద అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ హీరో మరో కొత్త కారు కొన్నాడు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్స్ వద్ద ఉన్న లంబోర్గినీ కారు పృథ్వీరాజ్ దగ్గర కూడా ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా పృథ్వీరాజ్ 911GT3 పోర్షే కారును తీసుకున్నాడు. పోర్స్చే 911 GT3 అనేది పోర్స్చే వాహనం స్పోర్ట్స్ కార్లలో అధిక-పనితీరు గల హోమోలోగేషన్ మోడల్. ఈ లగ్జరీ వాహనం ధర దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని సమాచారం. నివేదికల ప్రకారం ఈ కారు 375kW పనితీరును కలిగి ఉంటుంది. అలాగే ఈ కారు పనితీరు 6-స్పీడ్ GT స్పోర్ట్స్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది.
ఇదిలా ఉంటే.. పృథ్వీరాజ్ ఇటీవల డైరెక్టర్ విపిన్ దాస్ దర్శకత్వం వహించిన గురువాయూరంబాల నడాయిల్ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంపురాన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన లూసిఫరీ సినిమాకు రెండో భాగం ఇది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గుజరాత్ లో జరుగుతుంది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.