Jr.NTR: క్లాసికల్ డాన్స్‌తో కట్టిపడేసిన ఎన్టీఆర్.. ఎంత అందంగా చేస్తున్నాడో చూశారా..? చిన్ననాటి వీడియో..
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ది బెస్ట్ డాన్సర్లలో ఒకరిగా నిలిచిన తారక్.. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాడు. అందుకే ఇప్పుడు ఎలాంటి కష్టతరమైన స్టెప్పు అయినా చిటికెలో చేసి చూపిస్తారు. చిన్నప్పుడు స్టేజ్ పై ఎన్నో క్లాసికల్ డాన్స్ ప్రదర్శనలు ఇచ్చారు ఎన్టీఆర్. తాజాగా చిన్నవయసులోనే తారక్ ఇచ్చిన ఓ క్లాసికల్ డాన్స్ స్జేజ్ పర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరలవుతుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. మాస్ యాక్షన్ మూవీ అయినా.. లవ్ స్టోరీ అయినా తనదైన నటనతో మెప్పిస్తాడు. నందమూరి హరికృష్ణ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అమాయకంగా కనిపించినా అల్లరికి చిరునామా తారక్ అని చాలా మంది నటీనటులు చెప్పిన సంగతి తెలిసిందే. బయట ఎంత సీరియస్ గా కనిపించినా సెట్ లో తోటీ నటీనటులతో తారక్ చేసే అల్లరి మాములుగా ఉండదు. ఆర్టిస్టుల నుంచి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వరకు అందరితో ఎంతో చనువుగా ఉంటారు. అలాగే ఒక్కసారి యాక్షన్ చెప్పారంటే పాత్రలో లీనమైపోతాడు. అంతేకాకుండా అద్భుతమైన డాన్సర్ కూడా. ముందుగా ప్రీపరేషన్ లేకుండానే ఎలాంటి స్టెప్ అయినా సులభంగా చేస్తుంటారు. తారక్ కు భరతనాట్యంలోనూ ప్రవేశం ఉంది. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ లో శిక్షణ తీసుకున్నారు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ది బెస్ట్ డాన్సర్లలో ఒకరిగా నిలిచిన తారక్.. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాడు. అందుకే ఇప్పుడు ఎలాంటి కష్టతరమైన స్టెప్పు అయినా చిటికెలో చేసి చూపిస్తారు. చిన్నప్పుడు స్టేజ్ పై ఎన్నో క్లాసికల్ డాన్స్ ప్రదర్శనలు ఇచ్చారు ఎన్టీఆర్. తాజాగా చిన్నవయసులోనే తారక్ ఇచ్చిన ఓ క్లాసికల్ డాన్స్ స్జేజ్ పర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరలవుతుంది. ఆ వీడియోలో క్లాసికల్ డాన్స్ చేస్తూ తారక్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. బాల రామాయణం సినిమా కంటే ముందు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తారక్. ఈ మూవీ తర్వాత కూడా తారక్ చాలా స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులోనే నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత వెంటనే స్టూడెంట్ నెంబర్ 1 మూవీ, ఆది వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ అందుకున్నారు ఎన్టీఆర్. ఈమూవీలో కొమురం భీమ్ పాత్రలో అద్భుతమైన నటనతో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ తార జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. అలాగే అటు వార్ 2 చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడు తారక్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.