Kalki 2898 AD Release Updates: హిస్టారికల్ బ్లాక్ బస్టర్.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Jun 27, 2024 | 9:07 PM

Prabhas Kalki 2898 AD Theater talk Live Updates: ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం కల్కి 2898 ఏడీ. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‏తో భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ హైప్ నెలకొంది. భారతీయ పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నట్లు గతంలో డైరెక్టర్ నాగ్ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Kalki 2898 AD Release Updates: హిస్టారికల్ బ్లాక్ బస్టర్.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్
Kalki 2898 Ad

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం కల్కి 2898 ఏడీ. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‏తో భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ హైప్ నెలకొంది. భారతీయ పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నట్లు గతంలో డైరెక్టర్ నాగ్ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా.. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. ముందే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో విజువల్ వండర్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడింది. చాలా కాలంగా వెయిట్ చేస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా ఈరోజు (జూన్ 27న) థియేటర్లలో గ్రాండ్‏గా విడుదలైంది. బుధవారం అర్దరాత్రి నుంచే థియేటర్ల వద్దకు భారీగా చేరుకున్నారు ఫ్యాన్స్. డార్లింగ్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి బాణాసంచా కల్కి సందడి చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Jun 2024 07:20 PM (IST)

    ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచారు.. కల్కి పై చిరు ట్వీట్

    చిరంజీవి ట్వీట్ ..

  • 27 Jun 2024 05:49 PM (IST)

    నిజమైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్: ప్రశాంత్ వర్మ

  • 27 Jun 2024 05:05 PM (IST)

    కల్కి సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ వీళ్ళే

    కల్కి సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కేవీ,

  • 27 Jun 2024 03:52 PM (IST)

    బుజ్జి కారులో ప్రభాస్ పెద్దమ్మ ..

    కల్కి సినిమాను చూసిన ప్రభాస్ పెద్దమ్మ.. అలాగే బుజ్జి కారులో ఎక్కి సందడి చేశారు. సినిమా అద్భుతంగా ఉందని, ప్రభాస్ నటన చాలా బాగుందని ఆమె అన్నారు.

    Kalki 2898 Ad

    Kalki 2898 Ad

  • 27 Jun 2024 03:22 PM (IST)

    అన్ని ఏరియాల్లో సంచలనం సృస్తిస్తున్న కల్కి

    కల్కి సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్

  • 27 Jun 2024 01:53 PM (IST)

    అన్నయ్య సినిమా చూస్తూ సందడి చేసిన చెల్లెల్లు..

    ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా చూసేందుకు ప్రభాస్ పెద్దమ్మ ఉప్పలపాటి శ్యామల కూతుర్లతో కలిసి వచ్చారు. అన్నయ్య సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేశారు ప్రభాస్ చెల్లెల్లు.

  • 27 Jun 2024 01:38 PM (IST)

    ప్రభాస్ నిజమైన పాన్ ఇండియా స్టార్.. ప్రశాంత్ వర్మ..

    ప్రభాస్ నిజమైన పాన్ ఇండియా స్టార్ హీరో అన్నారు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈరోజు దర్శకుడు నాగ్ అశ్విన్‏తో కల్కి సినిమా చూసిన ప్రశాంత్ వర్మ.. తాజాగా నాగ్ అశ్విన్ తో తీసుకున్న సెల్ఫీ పోస్ట్ చేశారు.

  • 27 Jun 2024 01:22 PM (IST)

    అక్కడ ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన కల్కి..

    యూఎస్ సహా విదేశాలతోపాటు భారత్ లోనూ కల్కి షోలు పూర్తయ్యాయి. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. తాజాగా నార్త్ అమెరికాలో ఓ రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఆర్ఆర్ఆర్ పేరిట ఉన్న రికార్డ్ తిరగరాసింది. అక్కడ అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ప్రీమియర్ షోలతోపాటు ఇప్పటివరకు ఏకంగా 3.72 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

  • 27 Jun 2024 01:08 PM (IST)

    కల్కి హిట్ పై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్..

    డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్స్ అంటూ రివ్యూస్ రాగా.. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ సినిమాకు మంచి రివ్యూస్ రావడం తనకు చాలా సంతోషంగా ఉందని.. మూవీ హిట్టైనందుకు చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు.

  • 27 Jun 2024 12:49 PM (IST)

    పేరు మార్చుకున్న ప్రభాస్.. ఇకపై అలాగే..

    ప్రస్తుతం హీరోగా నటించిన కల్కి ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా టైటిల్స్ పడే సమయంలో ప్రభాస్ పేరు ముందు శ్రీ అని చేర్చడం ఆశ్చర్యం కలిగించింది.గతంలో యంగ్ రెబల్ స్టార్ అనే వచ్చేది.. ఇప్పుడు శ్రీ ప్రభాస్ అని వస్తుందని అంటున్నారు.

  • 27 Jun 2024 12:23 PM (IST)

    కల్కి మొత్తం ఎన్ని థియేటర్లలో రిలీజ్ అయ్యిందంటే..

    మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 8500 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. థియేటర్స్ పరంగా టాప్ 3లోకి వచ్చింది. కల్కి తర్వాత అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ అయిన సినిమాగా ఈ సాహో ఉంది.

  • 27 Jun 2024 12:05 PM (IST)

    39 ఏళ్ల తర్వాత కల్కితో ఆ ఫీట్ రిపీట్..

    కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కలిసి దాదాపు 39 ఏళ్ల తర్వాత నటించారు. 1985లో హిందీలో వచ్చిన గిరఫ్తార్ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రభాస్ సినిమాలో వారిద్దరూ కలిసి నటించడం విశేషం.

  • 27 Jun 2024 11:42 AM (IST)

    కల్కి టీషర్టులో ప్రభాస్ సినిమాకు వచ్చిన అకిరా..

    ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాకు పాజిటివ్ టాక్ వ్సుతంది. తెల్లవారుజామున నుంచే థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు సందడి చేస్తున్నారు. తాజాగా ఏపీ డీప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్ వద్దకు కల్కి టీ షర్టు వేసుకుని సినిమా చూసేందుకు వచ్చాడు.

  • 27 Jun 2024 11:27 AM (IST)

    వాటే ఏ విజన్.. వాటే ఏ క్లారిటీ.. నాగ్ అశ్విన్ పై ప్రశంసలు..

    కల్కి 2898 ఏడీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన విజువల్ ప్రపంచాన్ని సృష్టించారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

  • 27 Jun 2024 10:54 AM (IST)

    నాలుగేళ్ల సుధీర్ఘ ప్రయాణం.. కల్కి మేకర్స్ పోస్ట్..

    కల్కి సినిమా హిస్టారికల్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్. కల్కి విడుదల సందర్భంగా పైరసీని ప్రోత్సహించొద్దని కోరుతూ నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది.

  • 27 Jun 2024 10:33 AM (IST)

    కల్కి మూవీలో బుజ్జి కారు సెంటరాఫ్ ఎట్రాక్షన్

    వల్డ్‌వైడ్‌గా కల్కి మూవీ రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. బొమ్మ హిట్ అంటూ కేరింతలు కొడుతున్నారు. తీన్మార్ స్టెప్పులతో సంబరాల్లో మునిగిపోయారు. ఇక..కల్కి మూవీలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ బుజ్జి. అదేనండి..హీరో ప్రభాస్ కారు. దాదాపు 7కోట్ల రూపాయల ఖర్చు చేసి కోయంబత్తూరులో స్పెషల్‌గా దాన్ని తయారు చేయించారు.

  • 27 Jun 2024 10:20 AM (IST)

    బెంగుళూరులోనూ కల్కి క్రేజ్..

    హైదరాబాద్ లోని థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదు. ప్రభాస్ కటౌట్స్, పోస్టర్స్ ఏర్పాటు చేసి పాలభిషేకాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ డిజిటల్ కటౌట్స్ ఏర్పాటు చేసి డీజే పాటలతో హోరెత్తిస్తున్నారు.

  • 27 Jun 2024 10:12 AM (IST)

    కల్కి కోసం ప్రభాస్‏ను ఎంపిక చేసుకోవడానికి రీజన్ అదే..

    కల్కి 2898 ఏడీ సినిమా ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా గతంలో డైరెక్టర్ నాగ్ అశ్వి్న్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కల్కి సినిమా కథను ఇండస్ట్రీలో మరెవరు చేయలేరని.. అందుకే ప్రభాస్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు.

  • 27 Jun 2024 09:46 AM (IST)

    రాజమండ్రిలో కల్కి మేనియా

    రాజమండ్రిలో కల్కి మేనియా నడుస్తోంది. సినిమా చూసిన ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. బాణసంచాలు కాలుస్తూ ప్రభాస్ అభిమానులు సందడి చేస్తున్నారు.

  • 27 Jun 2024 09:25 AM (IST)

    కల్కిలో కనిపించిన మరో ఐదుగురు..

    ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడీ నేడు థియేటర్లలో విడుదలైంది. కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాలను పరిచయం చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన అద్భుత మాయ చిత్రానికి ఉదయం నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఇందులో కమల్ హసన్, అమితాబ్, దీపికా, శోభన, దిశా పటానీ, మాళవిక నాయర్ కీలకపాత్రలు పోషిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో ఐదుగురు సినిమాలో కనిపించారు. మృణాల్, డైరెక్టర్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కెవి, ఫరియా అబ్దుల్లా కనిపించారు.

  • 27 Jun 2024 09:05 AM (IST)

    నార్త్‏లో కల్కి విశ్వరూపం..

    పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కల్కి మేనియా కొనసాగుతుంది. ఈరోజు విడుదలైన ఈ సినిమాకు ఉదయం నుంచే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ లో ఎవరూ ఊహించని రవిధంగా దూసుకెళ్తుంది కల్కి. పీవీఆర్, ఐనాక్స్, సినిపోలిస్ వంటి మల్టిప్లెక్స్ థియేటర్లలో ఏకంగా 1,25,000 టికెట్స్ విక్రయం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాదిలో అత్యధిక టికెట్స్ అమ్ముడైన సినిమాల్లో టాప్ 3 ప్లేస్ స్థానాన్ని దక్కించుకుంది ఈ మూవీ.

  • 27 Jun 2024 08:47 AM (IST)

    హైదరాబాద్ థియేటర్ల దగ్గర కల్కి సినిమా పండుగ

    — థియేటర్ల దగ్గర కల్కి సినిమా పండుగ

    — సంబురాల్లో మునిగిపోయిన అభిమానులు

    — హిట్‌ టాక్‌తో జోరుగా బ్లాక్ మార్కెట్ దందా

    — బ్లాక్‌లో అధిక రేట్లకు కల్కి సినిమా టికెట్ల అమ్మకం

  • 27 Jun 2024 08:32 AM (IST)

    ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజ్ క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు..

    హైదరాబాద్‌లో థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ దగ్గర సందడి చేస్తున్నారు. డప్పుల దరువులతో సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇప్పటికే హిట్ టాక్ రావడంతో ఇదే అదునుగా బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు కొందరు. టికెట్లను అధిక రేట్లకు పెంచేసి విక్రయిస్తున్నారు. సంధ్య థియేటర్ల ఫ్యాన్స్ జోష్‌.

  • 27 Jun 2024 08:11 AM (IST)

    ప్రభాస్ మానియా

    ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కల్కి థియేటర్ల వద్ద ప్రభాస్ మానియా సందడి కనిపిస్తోంది.. తెల్లవారుజామున బెనిఫిట్ షో చూసిన ప్రభాస్ అభిమానులు ప్రభాస్ కి మరో హిట్ అంటున్నారు.. హిస్టారికల్ నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ విజువలైజేషన్ అద్భుతంగా ఉన్నాయని ఆ కాలంలో జరిగిన యుద్ధాన్ని అద్భుతంగా చూపించారు అంటున్నారు ప్రేక్షకులు…. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా థియేటర్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు.

  • 27 Jun 2024 07:58 AM (IST)

    హైదరాబాద్ ధియేటర్లలో కల్కి సినిమా పండుగ..

    • హైదరాబాద్ ధియేటర్లలో కల్కి సినిమా పండుగ.
    • మేళతాళాలతో సంబురాలు చేసుకుంటున్న అభిమానులు..
    • ఆర్టీసి క్రాస్ రోడ్డు సంద్య ధియేటర్ వద్ద అభిమానుల కోలాహలం
    • ఇదే అదునుగా జోరుగా సాగుతున్న బ్లాక్ టికెట్ల దందా..
  • 27 Jun 2024 07:39 AM (IST)

    హైదరాబాద్ థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా..

    రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్ థియేటర్లలో హీరో ప్రభాస్ ఫాన్స్ హంగామా సృష్టిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కల్కి సంబరాలతో నగరం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ imax థెయేటర్ దగ్గర కల్కి సినిమాలోని బుజ్జి అనే కార్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. Imax థెయేటర్ వద్ద ఉదయం 5:30 గంటల షో కోసం అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

  • 27 Jun 2024 07:23 AM (IST)

    విజయవాడ గాంధీ నగర్ లో ప్రభాస్ మల్కి మూవీ సందడి..

    విజయవాడ గాంధీ నగర్ లో తెల్లవారుజామున నుంచే ప్రభాస్ మల్కి మూవీ సందడి మొదలైంది. అర్ధరాత్రి నుంచే థియేటర్స్ దగ్గర అభిమానుల కోలహలం నెలకొంది. తెల్లవారుజామున 4:30 నిమిషాలకు బెనిఫిట్ షో ప్రారంభం కాగా.. ప్రభాస్ అభిమానులు థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఒక్కో టికెట్ ధర 350 రూ పలుకుతున్నట్లు సమాచారం.

  • 27 Jun 2024 07:06 AM (IST)

    కాకినాడలో ప్రభాస్ అభిమానుల కోలాహలం..

    కాకినాడలో ప్రభాస్ అభిమానుల కోలాహలం.. కాకినాడలో కల్కి సినిమా రిలీజ్ కావడంతో అభిమానుల కోలాహలం. బెనిఫిట్ షో 4; 15కి మొదలు కావడంతో పండగ వాతావరణం నెలకొన్న జిల్లాలో పలు థియేటర్లు. తీన్మార్ డప్పులతో హడావిడి చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్..

  • 27 Jun 2024 06:54 AM (IST)

    విశాఖలో కల్కి మూవీ సందడి

    • విశాఖలో కల్కి మూవీ సందడి
    • థియేటర్ల వద్ద బారులు తీరిన ఫ్యాన్స్
    • ఫస్ట్ డే మొదటి షో కోసం భారీగా తరలివచ్చిన ప్రేక్షకులు
    • థియేటర్ల వద్ద పోలీస్ బందోబస్తు
    • ఫ్యాన్స్ నినాదాలతో హోరేత్తుతున్న థియేటర్లు
    • తోలిరోజు ఆరు షోలకు పర్మిషనలతో జోష్ లో అభిమానులు

Published On - Jun 27,2024 6:52 AM

Follow us
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..