Kalki 2898 AD Twitter Review: కల్కి ట్విట్టర్ రివ్యూ ఇదే.. ఊహించని క్లైమాక్స్.. ఆ సీన్ అదిరిపోయింది..

రూ.600 కోట్ల బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. నాలుగున్నరేళ్ల నిరీక్షణ తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు నేడు థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాను విదేశాలతోపాటు.. పలు చోట్లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యారు. ఇప్పటికే సినిమా చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Kalki 2898 AD Twitter Review: కల్కి ట్విట్టర్ రివ్యూ ఇదే.. ఊహించని క్లైమాక్స్.. ఆ సీన్ అదిరిపోయింది..
Kalki 2898 Ad Cinema
Follow us

|

Updated on: Jun 27, 2024 | 6:33 AM

పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ నేడు (జూన్ 27న) థియేటర్లలో విడుదలైంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చింది. భారతీయ పురాణాలను ఆధారంగా తీసుకుని డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ ముందు నుంచి భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. కలి యుగాంతంలో అవతరించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు అంతేకాకుండా మొత్తం మూడు కొత్త ప్రపంచాలను సృష్టించినట్లు చెప్పుకొచ్చారు నాగ్. రూ.600 కోట్ల బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. నాలుగున్నరేళ్ల నిరీక్షణ తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు నేడు థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాను విదేశాలతోపాటు.. పలు చోట్లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యారు. ఇప్పటికే సినిమా చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ అని.. ఇక ఇంటర్వెల్ మెంటల్ లెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్ వరల్డ్ క్లాస్ గా ఉంది. హాలీవుడ్ లెవల్ లో ఉంది. థియేటర్స్ లో తప్పక చూడాల్సిన సినిమా కథ.. ఇంటర్వెల్ సినీ అదిరిపోయింది.. ప్రతి పది నిమిషాలకు ఒక కొత్త క్యారెక్టర్ సర్ ప్రైజ్ చేస్తుంది.. సెకండాఫ్ కథ పుంజుకుంది. నాన్ కల్కి రికార్డ్స్ పక్కా, నార్త్ వాళ్లకైతే ఫస్టాఫ్ చాలు.. సెకండాఫ్ బోనస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బ్లాక్ బస్టర్ హిట్ లోడింగ్.. తొలి 15 నిమిషాలు అస్సలు మిస్ కావొద్దంటూ కీలకపాత్రలో నటించిన విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్ ను ట్వి్ట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.