AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: మనిషి మాంసానికి రుచి మరిగిన లేడీ డాక్టర్.. ఓటీటీలో రొమాంటిక్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?

గతంలో ఎన్నడూ రాని కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఓ డిఫరెంట్ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఆ సినిమానే ఆమిస్. అస్సామీ భాషలో తెరకెక్కిన ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంది. దీంతో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. అనంతరం ఇండియాలో 2019 నవంబర్ 22న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

OTT: మనిషి మాంసానికి రుచి మరిగిన లేడీ డాక్టర్.. ఓటీటీలో రొమాంటిక్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?
OTT Movie
Basha Shek
| Edited By: |

Updated on: Jun 27, 2024 | 6:28 AM

Share

ఓటీటీలు వచ్చాక అన్ని భాషల సినిమాలు ఇంటి ముంగిట్లోకి వచ్చేశాయి. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై చాలా మంది క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇతర జోనర్లతో పోల్చుకుంటే వీటికే ఓటీటీల్లో ఎక్కువగా ఆదరణ ఉంటోంది. అందుకు తగ్గట్టే పలు ఓటీటీ సంస్థలు వివిధ భాషల్లో హిట్ అయిన ఈ కేటగిరీ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా గతంలో ఎన్నడూ రాని కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఓ డిఫరెంట్ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఆ సినిమానే ఆమిస్. అస్సామీ భాషలో తెరకెక్కిన ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంది. దీంతో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. అనంతరం ఇండియాలో 2019 నవంబర్ 22న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో అదరగొడుతోందీ రొమాంటిక్ థ్రిల్లర్. తెలుగు వెర్షన్ లేనప్పటికీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది ఆమిస్. ఈ సినిమా కథ విషయానికి వస్తే..

ఆమిస్ అంటే అస్సామి భాషలో మాంసాహారి అని అర్థం. టైటిల్‌కు తగినట్లే ఈ సినిమా నాన్ వెజ్ వంటకాల చుట్టూ తిరుగుతుంది. సుమన్ అనే కుర్రోడు ఓ PHD స్టూడెంట్. తన స్నేహితులతో కలిసి అడవులకు వెళ్లి.. అక్కడ దొరికే జంతువుల మాంసాన్ని ఆరగిస్తుంటాడు. అలా తినే క్రమంలో ఒక రోజు తన ఫ్రెండ్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. చికిత్స కోసం నిర్మలి అనే లేడీ డాక్టర దగ్గరకు వెళతాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. లేడీ డాక్టర్ కూడా తనకు మాంసం అంటే ఇష్టమని చెప్పడంతో మరుసటి రోజు కుందేలు మాంసం పట్టు కొస్తాడు. నిర్మలికి అప్పటికే వివాహమై పిల్లాడు కూడా ఉంటాడు. కానీ వాళ్లిద్దరూ మాత్రం బాగా దగ్గరవుతారు. వేర్వేరు జంతువుల మాంసాలను టేస్ట్ చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమెపై ప్రేమ ఎక్కువై పోయి.. తన శరీరంలోని ఒక భాగాన్ని కట్ చేసి దానిని వండి నిర్మలికి తినిపిస్తాడు. అది ఆమెకు విపరీతంగా నచ్చేస్తుంది. లేడీ డాక్టర్ మెల్లగా మనిషి మాంసానికి అలవాటు పడుతుంది. మరి నిర్మలి కోసం సుమన్ ఏమేం చేశాడు? ఈ కథ ఎక్కడకు చేరింది అనేది తెలుసుకోవాలంటే ‘ఆమీస్’ అనే సినిమాను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.