Maharaja OTT: ఓటీటీలోకి విజయ్ సేతుపతి 100 కోట్ల సినిమా.. తెలుగులోనూ మహారాజ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

మహారాజ సినిమాతో చాలా రోజుల తర్వాత సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విజయ్ సేతుపతి. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే వంద కోట్ల వసూళ్లు దాటేసింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విజయ్ సేతుపతి సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి

Maharaja OTT: ఓటీటీలోకి విజయ్ సేతుపతి 100 కోట్ల సినిమా.. తెలుగులోనూ మహారాజ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
Maharaja Movie
Follow us

|

Updated on: Jun 27, 2024 | 5:44 PM

చాలా రోజుల తర్వాత మహారాజ సినిమాతో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విజయ్ సేతుపతి. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే వంద కోట్ల వసూళ్లు దాటేసింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విజయ్ సేతుపతి సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మహారాజ పేరుతోన డబ్ అయిన ఈ సినిమకు ఇప్పటివరకు తెలుగు నాట సుమారు రూ. 20 కోట్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక రికార్డుల పరంగా చూసుకుంటే..తెలుగులో డ‌బ్ అయిన విజ‌య్ సేతుప‌తి సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మహారాజ ఘనత సాధించింది. ఇక ఈ ఏడాది త‌మిళంలో అత్య‌ధిక కలెక్షన్లను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా మ‌హారాజ నిలిచింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడియెన్స్ ను అలరిస్తోన్న మహారాజ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఒక ఆసక్తిక వార్త వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ నెట్ ఫ్లిక్స్ మక్కల్ సెల్వన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జులై 19 నుంచి మహారాజ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగులోనూ అదే రోజు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని టాక్. త్వరలోనే మహారాజ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది

సినిమా కథేంటంటే..

నితిల‌న్ సామినాథ‌న్ తెరకెక్కించిన మహారాజ సినిమాలో అనురాగ్ క‌శ్య‌ప్‌, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌, అభిరామి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో మ‌హారాజ (విజ‌య్ సేతుప‌తి) ఓ బార్బ‌ర్‌. త‌న కూతురితో క‌లిసి నగరానికి దూరంగా ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. అయితే ఓ రోజు కొంద‌రు దుండగులు మహరాజ ఇంటిపై దాడిచేసి ల‌క్ష్మిని ఎత్తుకుపోయార‌ని మ‌హారాజ పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాడు. మరి ఇంత‌కు ల‌క్ష్మి ఎవ‌రు? మహారాజ కంప్లైంట్‌ను పోలీసులు ఎందుకు సీరియ‌స్‌గా తీసుకోలేదు. త‌న కూతురిపై జ‌రిగిన అన్యాయానికి మ‌హారాజ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నదే ఈ మూవీ కథ. ప్రస్తుతం ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు