Team India: షాకింగ్.. జింబాబ్వే సిరీస్‌కు తెలుగబ్బాయి నితీష్ రెడ్డి దూరం.. బీసీసీఐ ప్రకటన.. కారణమిదే
క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ వరల్డ్ కప్ 2024 సెమీ ఫైనల్ మ్యాచ్ పైనే ఉంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు ఒక ఆసక్తికర వార్త అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబేకి బీసీసీఐ మరో అవకాశం కల్పించింది
క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ వరల్డ్ కప్ 2024 సెమీ ఫైనల్ మ్యాచ్ పైనే ఉంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు ఒక ఆసక్తికర వార్త అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబేకి బీసీసీఐ మరో అవకాశం కల్పించింది. ప్రపంచకప్ తర్వాత శివమ్ దూబేకు విశ్రాంతి ఇవ్వకుండా, జింబాబ్వే పర్యటన రూపంలో బీసీసీఐ అతనికి అవకాశం కల్పించింది. ఐపీఎల్ 17వ సీజన్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ అద్భుతంగా రాణించిన తెలుగబ్బాయి, ఎస్ ఆర్ హెచ్ ప్లేయర్ నితీష్ రెడ్డి స్థానంలో శివమ్ దుబేను చేర్చారు. గాయం కారణంగా నితీశ్ రెడ్డి జింబాబ్వే టీ20 సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేసింది. అసలు నితీష్‌కి ఏమైంది? అన్నది చెప్పలేదు కానీ, బీసీసీఐకి చెందిన మెడికల్ టీమ్ అతనిని పర్యవేక్షిస్తోందని బీసీసీఐ తెలిపింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ మొత్తం 5 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూలై 6 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే గాయం నుంచి నితీష్ ఇప్పట్లో కోలుకోలేడని ఖాయం కావడంతో అతని ప్లేస్ లో శివమ్ దుబేని చేర్చినట్లు తెలుస్తోంది.
🚨 NEWS 🚨
Shivam Dube replaces Nitish Reddy in the #TeamIndia squad for the series against Zimbabwe. #ZIMvIND
Details 🔽https://t.co/WMktNAIDIx
— BCCI (@BCCI) June 26, 2024
మరోవైపు బీసీసీఐ సెలక్షన్ కమిటీ జింబాబ్వే పర్యటనలో మొత్తం యువ ఆటగాళ్లకే అవకాశం కల్పించింది. జింబాబ్వేతో జరిగే సిరీస్‌లో టీమ్‌ఇండియాకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు. అలాగే తొలిసారిగా ఐపీఎల్‌లో ఆడుతున్న యువ ప్రతిభ గల ఆటగాళ్లను వివిధ జట్ల నుంచి ఎంపిక చేశారు. తుషార్ దేశ్‌పాండే (చెన్నై), రియాన్ పరాగ్ (రాజస్థాన్), అభిషేక్ శర్మ (హైదరాబాద్) తొలిసారి భారత జట్టులోకి ఎంపికయ్యారు.
జింబాబ్వే పర్యటనకు టీమిండియా :
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రితురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవీష్‌నోయ్, అవీష్‌నోయ్, అవీష్ణోయ్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే.
భారతదేశం జింబాబ్వే టూర్ షెడ్యూల్
- జూలై 6 – 1వ T20, హరారే
- 7 జూలై – 2వ T20, హరారే
- జూలై 10 – 3వ T20, హరారే
- జూలై 13 – 4వ T20, హరారే
- జూలై 14 – 5వ T20, హరారే
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..