Kalki 2898 AD Movie Review: హిట్టా.? ఫట్టా.? ప్రభాస్ లక్ ఎలా ఉంది.! కల్కి తో నిలిచాడా.?

Kalki 2898 AD Movie Review: హిట్టా.? ఫట్టా.? ప్రభాస్ లక్ ఎలా ఉంది.! కల్కి తో నిలిచాడా.?

Anil kumar poka

|

Updated on: Jun 27, 2024 | 4:33 PM

కల్కి 2898 ఏడి గురించి ఇండియన్ సినిమాలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. విజువల్స్ అద్భుతంగా ఉండటం.. పురాణాల నేపథ్యంలో సినిమా రావడంతో ఎలా ఉండబోతుందో అనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. మరి కల్కి సినిమా నిజంగానే అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి ఈ రివ్యూలో చూద్దాం.! కురుక్షేత్ర యుద్ధం జ‌రిగిన 6 వేల ఏళ్ళ తర్వాత భూమి పూర్తిగా నాశనం అవుతుంది..

కల్కి 2898 ఏడి గురించి ఇండియన్ సినిమాలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. విజువల్స్ అద్భుతంగా ఉండటం.. పురాణాల నేపథ్యంలో సినిమా రావడంతో ఎలా ఉండబోతుందో అనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. మరి కల్కి సినిమా నిజంగానే అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి ఈ రివ్యూలో చూద్దాం..

కురుక్షేత్ర యుద్ధం జ‌రిగిన 6 వేల ఏళ్ళ తర్వాత భూమి పూర్తిగా నాశనం అవుతుంది.. అధ‌ర్మంతో మరో ప్రపంచాన్ని తనకోసం సృష్టించుకుని మనుషులను పురుగుల కంటే హీనంగా చూస్తుంటాడు సుప్రీమ్ యస్కిన్ అలియాస్ కమల్ హాసన్. యాస్కిన్ అన్యాయాల‌పై శంబాల అనే ప్రపంచం నుంచి యుద్ధం చేస్తుంటారు కొందరు రెబెల్స్. కాలక్రమేనా మనుషులు ప్ర‌కృతిని నాశ‌నం చేస్తుండటంతో.. కాంప్లెక్స్ పేరుతో కొత్త ప్ర‌పంచాన్ని సృష్టిస్తాడు యస్కిన్. అక్కడ కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అక్కడికి వెళ్లాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. అందులో భైర‌వ అలియాస్ ప్ర‌భాస్‌ కూడా ఒక‌డు. కాంప్లెక్స్‌లోకి వెళ్లాల‌న్న‌ది అత‌డి క‌ల‌. మరోవైపు అన్యాయాలు పెరిగిపోవడంతో దేవుడు మ‌ళ్లీ క‌ల్కి అవ‌తారంలో జన్మిస్తారని శంబాలా ప్ర‌జ‌లు న‌మ్ముతుంటారు. తమ దేవుడికి జ‌న్మ‌నిచ్చే అమ్మ కోసం చూస్తున్న వాళ్లకు.. సుమ‌తి అలియాస్ దీపికా ప‌దుకొనే కనిపిస్తుంది. ఆమె యస్కిన్ ప్రపంచం నుంచి తప్పించుకుంటుంది. సుమ‌తిని తమకు పట్టిస్తే కాంప్లెక్స్‌లోకి ప్ర‌వేశం క‌ల్పిస్తామ‌ని క‌మాండ‌ర్ మాన‌స్‌ అలియాస్ శ‌శ్వ‌తా ఛ‌ట‌ర్జీ భైర‌వ‌తో ఒప్ప‌దం కుదుర్చుకుంటాడు. అప్పుడు భైరవ బారి నుంచి సుమ‌తిని రక్షించే బాధ్యతను అశ్వ‌త్థామ అలియాస్ అమితాబ్ బ‌చ్చ‌న్‌ తీసుకుంటాడు. అసలు అశ్వద్ధామ ఎక్కడ్నుంచి వచ్చాడు..? కురుక్షేత్ర యుద్ధం జరిగిన 6 వేల ఏళ్ళ తర్వాత కూడా అశ్వద్ధామ ఎలా బతికి ఉంటాడు..? ఆయనేం చేసాడు..? సుమతిని ఎలా కాపాడాడు.. శంబాల ప్రజల్ని కాపాడాడా లేదా అనేది అసలు కథ..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jun 27, 2024 04:33 PM