AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani: ‘మా పెళ్లికి రండి’.. ఆ స్టార్ హీరోల ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానం అందించిన అనంత్ అంబానీ.. వీడియో

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నారు. జూలై 12న ముంబైలోని జియో సినిమా వరల్డ్‌లో ఈ వివాహ వేడుక ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకను ఘనంగా నిర్వహించారు

Anant Ambani: 'మా పెళ్లికి రండి'.. ఆ స్టార్ హీరోల ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానం అందించిన అనంత్ అంబానీ.. వీడియో
Anant Ambani Wedding
Basha Shek
|

Updated on: Jun 27, 2024 | 7:00 PM

Share

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నారు. జూలై 12న ముంబైలోని జియో సినిమా వరల్డ్‌లో ఈ వివాహ వేడుక ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇటీవలే క్రూయిజ్ పార్టీ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. కోట్లాది రూపాయలను ఖర్చు చేసి ఎంతో ఆడంబరంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహంచారు. ఇప్పుడిక పెళ్లి వేడుకల కోసం రెడీ అవుతోంది అంబానీ ఫ్యామిలీ. ఇందుకోసం వెడ్డింగ్ కార్డులను కూడా సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే అనంత్ అంబానీ స్వయంగా రాధికతో వెళ్లి బాలీవుడ్ హీరోలను తన వివాహ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. అనంత్ అంబానీ బుధవారం (జూన్ 26) రాత్రి అక్షయ్ కుమార్ జుహు నివాసానికి వెళ్లారు. రోల్స్ రాయిస్‌లో అక్షయ్ ఇంటికి వెళ్లి తమ పెళ్లికి రావాలని స్వయంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే అజయ్ దేవగన్, కాజోల్ నివాసానికి కూడా వెళ్లారు.

అంతకుముందు నీతా అంబానీ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లు ఇప్పటికే రెండు సార్లు ఘనంగా జరిగాయి. గతంలో ఈ కార్యక్రమం గుజరాత్‌లో జరిగింది. ఆ తర్వాత విదేశాల్లో క్రూయిజ్ షిప్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలకు విదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానించారు. అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. జూలై 12, 13, 14 తేదీల్లో ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఇక అనంత్ అంబానీ వెడ్డింగ్‌ కార్డ్స్‌ కూడా ఎంతో వెరైటీగా డిజైన్‌ చేశారు. చిన్నపాటి దేవుడి మందిరాన్నే కానుకగా ఇచ్చారు. అందులోనే వివాహ ఆహ్వాన పత్రికను కూడా పొందుపరిచారు.

ఇవి కూడా చదవండి

అక్షయ్, అజయ్ దేవ్ గణ్ ల ఇంటికి వెళుతోన్న అనంత్ అంబానీ.. వీడియో ఇదిగో..

అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అలియా దంపతులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ