- Telugu News Photo Gallery Cinema photos Actress Kangana Ranaut focusing on movies again after winning lok sabha election seat Telugu Heroines Photos
Kangana Ranaut: మళ్లీ సినిమాల మీద ఫోకస్ చేస్తున్న కంగనా.. రిలీజ్ డేట్ లాక్.!
ఎన్నికల హడావిడి ముగియటంతో మళ్లీ సినిమాల మీద ఫోకస్ చేశారు కంగనా రనౌత్. తను స్వయంగా డైరెక్ట్ చేసిన కాంట్రవర్షియల్ మూవీ ఎమర్జెన్సీ రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు. అంతేకాదు ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలోనూ క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ మళ్లీ ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న ఈ బ్యూటీ, తిరిగి ఫోకస్‌ను సినిమాల మీదకు షిఫ్ట్ చేశారు.
Updated on: Jun 27, 2024 | 7:07 PM

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు కంగనా రనౌత్. ఒకప్పుడు వరసగా విజయాలతో పాటు నేషనల్ అవార్డులు కూడా సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్లుగా ఫామ్‌లో లేరు.

కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. పర్సనల్‌గా మాత్రం సక్సెస్ అయ్యారు. రాజకీయాల్లోకి వెళ్లి ఎంపి కూడా అయ్యారీమె. ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాతో వచ్చేస్తున్నారు. నిజానికి ఎమర్జెన్సీ సినిమా ప్రకటించినప్పటి నుంచే కంగనకు కష్టాలు తప్పట్లేదు.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమాను సెప్టెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. యాక్చువల్‌గా ఎమర్జెన్సీ సినిమా ఎన్నికలకు ముందే రిలీజ్ కావల్సి ఉంది. ఆ ప్లాన్‌తోనే ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు.

కంగన సినిమాపై కోర్ట్‌కు సెన్సార్ బోర్ట్ ఏం చెప్పింది..? దానికి నిర్మాతలు ఇచ్చిన రిప్లై ఏంటి..? ఎమర్జెన్సీ సెన్సార్ విషయమై బాంబే హై కోర్టులో విచారణ జరిగింది.

సినిమాలో ఉన్న కొన్ని అభ్యంతరకర సీన్స్ తొలగిస్తే గానీ.. సర్టిఫికెట్ ఇవ్వలేమని కోర్టుకు వివరించింది సెన్సార్ బోర్డు. దీనిపై సెప్టెంబర్ 30 లోపు నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలను కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 30న జరగనుంది. ఆ రోజే ఎమర్జెన్సీ విడుదలపై క్లారిటీ రానుంది. మొదట్నుంచే ఎమర్జెన్సీపై వివాదాలున్నాయి.





























