SA vs IND T20 WC Result: చక్ దే ఇండియా.. జగజ్జేతగా భారత జట్టు.. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం
మొదట క్లాసెన్ ను ఔట్ చేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టారు. పదునైన బంతులు వేస్తూ సౌతాఫ్రికా బ్యాటర్లను బెదరగొట్టారు. మధ్యలో వికెట్ల తీస్తూ మ్యాచ్ పై పట్టు బిగించారు. చివరకు 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు.
South Africa vs India Result, T20 World Cup 2024: 5 ఓవర్లు.. 30 రన్స్. . క్రీజులో డేంజరస్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్.. డేవిడ్ మిల్లర్.. ఈ పరిస్థితులు చూస్తే ఎవరైనా దక్షిణాఫ్రికాదే విజయమనుకుంటారు. కానీ భారత బౌలర్లు అద్భుతం చేశారు. మొదట క్లాసెన్ ను ఔట్ చేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టారు. పదునైన బంతులు వేస్తూ సౌతాఫ్రికా బ్యాటర్లను బెదరగొట్టారు. మధ్యలో వికెట్ల తీస్తూ మ్యాచ్ పై పట్టు బిగించారు. చివరకు 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. 177 పరుగుల లక్ష్య ఛేదనలో ఒకానొకదశలో దక్షిణాఫ్రికా విజయం సాధించినట్లే అనిపించింది. కానీ చివరి 5 ఓవర్లలో భారత బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. దక్షిణాఫ్రికాను ఒత్తిడి లోకి నెట్టేశారు. ఫలితంగా సఫారీలు విజయానికి 7 పరుగుల దూరంలో ఆగిపోయారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ అత్యధికంగా 76 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 47 పరుగులు చేశాడు. శివమ్ దూబే 27 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 9, రవీంద్ర జడేజా 2, హార్దిక్ పాండ్యా 5* పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా తరఫున కేశవ్ మహరాజ్, ఎన్రిక్ నోర్కియా చెరో 2 వికెట్లు తీశారు. మార్కో జాన్సెన్, కగిసో రబడా చెరో వికెట్ తీశారు.
ప్రధాని మోడీ అభినందనలు..
CHAMPIONS!
Our team brings the T20 World Cup home in STYLE!
We are proud of the Indian Cricket Team.
This match was HISTORIC. 🇮🇳 🏏 🏆 pic.twitter.com/HhaKGwwEDt
— Narendra Modi (@narendramodi) June 29, 2024
𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆#TeamIndia 🇮🇳 HAVE DONE IT! 🔝👏
ICC Men’s T20 World Cup 2024 Champions 😍#T20WorldCup | #SAvIND pic.twitter.com/WfLkzqvs6o
— BCCI (@BCCI) June 29, 2024
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):
క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ
రోహిత్ ఎమోషనల్..
📸 Frame This!
WE HAVE DONE IT! 👏 🏆#T20WorldCup | #TeamIndia | #SAvIND | @ImRo45 pic.twitter.com/qDEOXSCyq0
— BCCI (@BCCI) June 29, 2024
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..