Raghava Lawrence: ‘ఇకపై నా కొడుకు వస్తాడు’.. తన సేవాగుణానికి వారసుడిని పరిచయం చేసిన రాఘవ లారెన్స్.. వీడియో

లారెన్స్ తన కుమారునికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తమ బిడ్డలను ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేద్దామా? అని ఆలోచిస్తుంటారు. కానీ లారెన్స్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుని మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు

Raghava Lawrence: 'ఇకపై నా కొడుకు వస్తాడు'.. తన సేవాగుణానికి వారసుడిని పరిచయం చేసిన రాఘవ లారెన్స్.. వీడియో
Raghava Lawrence Son
Follow us
Basha Shek

|

Updated on: Jul 01, 2024 | 8:32 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్, నటుడు రాఘవ లారెన్స్‌ గురించి సినీ జనాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన సినిమాలతో అభిమానులను అలరిస్తోన్న ఈ హీరో కష్టాల్లో ఉన్న వారికి తనవంతుగా సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే ఒక సేవా ట్రస్టును ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లలను చేరదీశాడీ రియల్ హీరో. గుండెజబ్బుతో బాధపడుతున్నఎంతో మంది చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించాడు. ఈ మధ్యన పేదలకు ట్రాక్టర్లు, బైక్స్, ఆటోలు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అలాగే వికలాంగులకు ట్రై సైకిల్స్ ను కూడా అందజేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే లారెన్స్ చేస్తోన్న సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే లారెన్స్ తన కుమారునికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తమ బిడ్డలను ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేద్దామా? అని ఆలోచిస్తుంటారు. కానీ లారెన్స్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుని మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు.

అదేంటంటే.. బిడ్డలకు ఆస్తులను వారసత్వంగా ఇచ్చే ఈ రోజుల్లో తన సేవా గుణాన్నితన కుమారుడు శ్యామ్ కు వారసత్వంగా ఇచ్చాడు రాఘవ లారెన్స్. ఈ సందర్భంగా తన లాగే తన కుమారుడికి కూడా చిన్నప్పటి నుంచే సాయం చేసే అలవాటు ఉందంటూ తన వారసుడిని పరిచయం చేశాడు. ట్విట్టర్ వేదికగ ఒక వీడియోను షేర్ చేసిన లారెన్స్ అందులో తన కుమారుడిని అభిమానులకు, స్నేహితులకు పరిచయం చేశాడు. అలాగే శ్యామ్ గురించి కొన్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. శ్యామ్ ప్రస్తుతం కాలేజీలో చదువుతూనే పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడనన్నాడు లారెన్స్.

ఇవి కూడా చదవండి

ఇకపై నా బిడ్డ వస్తాడు..

‘నేను గత పదేళ్లుగా హెప్సిబా అనే అమ్మాయి చదువు కోసం నా వంతు డబ్బు సాయం చేస్తున్నాను. ఇక నుంచి ఆ అమ్మాయికి శ్యామ్ సాయం చేస్తాడు. ఈ సంతోషకరమైన క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి శ్యామ్ తన సేవా యాత్రను కొనసాగిస్తాడని, దీనికి మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని లారెన్స్ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. లారెన్స్ నిర్ణయంపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.