- Telugu News Photo Gallery Cinema photos Fans tension on when will Mahesh Babu film with Rajamouli will finish shooting
Rajamouli: మహేష్ ఫ్యాన్స్ లో కంగారు.. జక్కన్న పోగొడతారా ??
అమ్మో... ఈయనకి దొరికితే ఐదేళ్లు తినేస్తాడు అని అంటాడు భైరవ... ఈసారి దొరుకు పదేళ్లు తొక్కేస్తా అంటారు జక్కన్న... కల్కి సినిమాలో ఈ సీన్ ఆడియన్స్ కి ఆనందం పంచింది. కానీ ఇదే టాపిక్ ఇప్పుడు మహేష్ ప్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రభాస్ స్పీడు బాగానే ఉంది.. మరి మావాడి సంగతీ.... అంటూ ఆలోచనల్లో పడిపోతున్నారు. మహేష్ - రాజమౌళి కాంబినేషన్ మాత్రం అందరూ ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న సినిమా.
Updated on: Jul 02, 2024 | 7:00 PM

అమ్మో... ఈయనకి దొరికితే ఐదేళ్లు తినేస్తాడు అని అంటాడు భైరవ... ఈసారి దొరుకు పదేళ్లు తొక్కేస్తా అంటారు జక్కన్న... కల్కి సినిమాలో ఈ సీన్ ఆడియన్స్ కి ఆనందం పంచింది. కానీ ఇదే టాపిక్ ఇప్పుడు మహేష్ ప్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రభాస్ స్పీడు బాగానే ఉంది.. మరి మావాడి సంగతీ.... అంటూ ఆలోచనల్లో పడిపోతున్నారు.

మహేష్ - రాజమౌళి కాంబినేషన్ మాత్రం అందరూ ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న సినిమా. మా హీరోతో సినిమా ఎందుకు చేయరని జక్కన్నని అడిగినవారూ, రాజమౌళికి డేట్స్ ఎందుకు ఇవ్వరని మహేష్‌ని అడిగిన వారందరూ ఇప్పుడు ఈ కాంబో సెట్ కావడంతో ఫుల్ ఖుషీ.

అయితే, రాజమౌళి - మహేష్ మూవీ ఎప్పటి నుంచి మొదలవుతుందన్న విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. ఆ మధ్య సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజున గ్లింప్స్ రిలీజ్ చేస్తారని, టెస్ట్ కట్ వీడియోలు రెడీ అవుతున్నాయనీ రకరకాల వార్తలొచ్చాయి. అయితే ఏవీ ఇంప్లిమెంట్ కాలేదు.

మరి త్వరలోనే మహేష్ పుట్టినరోజు రానుంది. ఆలోపైనా రాజమౌళి ఏదో ఒకటి తేలుస్తారా? లేదా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. రీసెంట్‌గా ఆస్కార్ నుంచి ఆహ్వానం అందుకున్నారు జక్కన్న. ఓ వైపు ఆ పనులమీద కూడా కాన్‌సెన్‌ట్రేట్ చేయాలి.

మహేష్ మూవీని ఇంటర్నేషనల్ రేంజ్‌కి ఇంచు కూడా తగ్గకుండా తెరకెక్కించాలి. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. అన్‌లిమిటెడ్ బడ్జెట్‌తో అంచనాలకు అందకుండా తరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి, ఆ మాత్రం ఆలస్యాన్ని భరించాల్సిందేనని తమలో తాము సర్ది చెప్పుకుంటున్నారు.




