- Telugu News Photo Gallery Cinema photos Prabhas makes a new record with release of 4 consecutive Pan India movies
Prabhas: సరికొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్న డార్లింగ్ ప్రభాస్..
అనుకునే చేసినా, అనుకోకుండా అలా జరిగిపోయినా డార్లింగ్ ఖాతాలో రికార్డులు మాత్రం అలా వచ్చి పడిపోతున్నాయంతే. సినిమా రిలీజు కన్నా, కంటెంట్ ఎలా ఉందనే టాపిక్‌కన్నా, రికార్డుల మీదే ఫోకస్ ఎక్కువగా ఉంటున్న ఈ టైమ్‌లో... డార్లింగ్ లేటెస్ట్ గా ఏం రికార్డు సృష్టించారు? అని అనుకుంటున్నారా? కమాన్ లెట్స్ వాచ్... పోస్ట్ కోవిడ్ వరుసగా నాలుగు ప్యాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేసుకున్న స్టార్ హీరోగా రికార్డు క్రియేట్ చేశారు ప్రభాస్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jul 02, 2024 | 6:45 PM

కానీ శుక్రవారం నుంచి ఆ రేట్స్ తగ్గబోతున్నాయి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తారని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. దీంతో మరోసారి వసూళ్ల విషయంలో కొత్త స్పైక్ కనిపించబోతుంది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

ఈ సారి గ్రాఫిక్స్ వర్క్ మరింత భారీగా ఉండబోతుందని, అందుకే పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు ఎక్కవు టైమ్ పడుతుందని చెప్పారు.

కల్కి జోరుతో ఫుల్ హ్యాపీగా ఉన్న మేకర్స్ ఆల్రెడీ సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా ఇచ్చేశారు. ఈ ఏడాదే సీక్వెల్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.

రాధేశ్యామ్ ఫ్లాప్ అయినా, ఆదిపురుష్ అస్సాం పోయినా పట్టించుకోలేదు డార్లింగ్. చేస్తున్న పని ఆత్మసంతృప్తినిస్తే చాలనే పంథాతో ముందుకు సాగుతున్నారు. లేటెస్ట్ గా ఆయన నటించిన కల్కి సెలబ్రిటీల ప్రశంసలు పొందుతోంది.

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా కల్కి 2898 ఏడీ. రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది.





























