- Telugu News Photo Gallery Cinema photos Janhvi Kapoor movie Devara delayed and Disha Patani Kanguva releasing on October 10th
పాపం !! ఆ విషయంలో.. జాన్వీ ప్లేస్ కబ్జా చేస్తున్న దిశా పటాని..
అసలు కొందరి గురించి కంపేరిజన్ ఎందుకొస్తుందో తెలియదు. కానీ విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంటారు. అలా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నారు జాన్వీ కపూర్ అండ్ దిశా పాట్ని. వీరిద్దరికీ ఓ విషయంతో లింకు పెట్టి సరదాగా మాట్లాడుకుంటున్నారు మూవీగోయర్స్. తెలుగు సినిమాలు దిశా పాట్నికి కలిసొస్తాయా? లేదా? మొన్న మొన్నటిదాకా ఇదో ఆసక్తికరమైన టాపిక్. కానీ కల్కి సక్సెస్‌తో దిశకి టాలీవుడ్‌లో హిట్ వచ్చేసింది.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Jul 02, 2024 | 6:33 PM

అసలు కొందరి గురించి కంపేరిజన్ ఎందుకొస్తుందో తెలియదు. కానీ విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంటారు. అలా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నారు జాన్వీ కపూర్ అండ్ దిశా పాట్ని. వీరిద్దరికీ ఓ విషయంతో లింకు పెట్టి సరదాగా మాట్లాడుకుంటున్నారు మూవీగోయర్స్

తెలుగు సినిమాలు దిశా పాట్నికి కలిసొస్తాయా? లేదా? మొన్న మొన్నటిదాకా ఇదో ఆసక్తికరమైన టాపిక్. కానీ కల్కి సక్సెస్‌తో దిశకి టాలీవుడ్‌లో హిట్ వచ్చేసింది. కానీ, కల్కిలో ఒకటీ అరా సన్నివేశాలు, ఓ పాటతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ బ్యూటీ. పూర్తి స్థాయి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ లేకపోయినా, భైరవ జోడీగా నటించినందుకు హ్యాపీ అంటున్నారు దిశా పాట్ని.

మరో మూడున్నర నెలల్లో మళ్లీ సౌత్ ఆడియన్స్ ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు దిశా పాట్ని. సూర్య హీరోగా నటిస్తున్న కంగువ 38 భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ దిశాపాట్ని.

అక్టోబర్ 10న విడుదల కానుంది కంగువ. ఈ సినిమాలో అయినా కాస్త నిడివి ఎక్కువ ఉన్న పాత్రతో మెప్పించాలన్నది ఆమె కోరిక. మరి మేకర్స్ ఆమె మాటను కన్సిడర్ చేస్తారా? సినిమా లెంగ్త్ ఎక్కువవుతోందని ఎడిటింగ్ టేబుల్ మీద కట్ చేస్తారా? అనేది చూడాలి.

అన్నీ ముందుగా అనుకున్నట్టే జరిగి ఉంటే, అక్టోబర్ 10న జాన్వీ తెర మీద మెరుపులు మెరిపించేవారే. తన అభిమాన నటుడు తారక్ తో కలిసి సిల్వర్‌స్క్రీన్స్ మీద దుమ్మురేపేవారే. దేవర సినిమా పనులు త్వరగా పూర్తి అవుతుండటంతో సెప్టెంబర్‌కి ప్రీ పోన్ అయింది. సో జాన్వీ రావాల్సిన ఆ డేట్‌కి వచ్చేస్తున్నారు దిశా పాట్ని. ఈ విధంగా, అక్టోబర్ 10 లింకుతో జాన్వీ, దిశను గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు.





























