AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Prema : దేవి సినిమా కోసం లెన్స్‌లు వాడడంతో కళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చింది.. కానీ చివరకు.. హీరోయిన్ ప్రేమ..

సినీ ప్రస్థానం అంత సులువుగా జరగలేదని, అనేక కష్టాలను ఎదుర్కున్నానని హీరోయిన్ ప్రేమ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మొదట ఎయిర్ హోస్టెస్‌ కావాలనే కోరిక ఉండేదని, అనుకోకుండా సినిమా రంగంలోకి ప్రవేశించానని చెప్పారు. ఆమె మొదటి కన్నడ చిత్రం "ఓం" ఒక పెద్ద విజయంగా నిలిచింది. తెలుగులో "ధర్మచక్రం", "దేవి" వంటి చిత్రాలతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. దర్శకుడు కోడి రామకృష్ణ తనకి తెలుగు నేర్పించారని, వెంకటేష్, మోహన్ బాబు, జగపతి బాబు వంటి అగ్ర హీరోలతో పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

Actress Prema : దేవి సినిమా కోసం లెన్స్‌లు వాడడంతో కళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చింది.. కానీ చివరకు.. హీరోయిన్ ప్రేమ..
Prema
Rajitha Chanti
|

Updated on: Feb 27, 2026 | 12:11 PM

Share

భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎవర్ గ్రీన్ హీరోయిన్ ప్రేమ. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చాలా కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని, ఎదురైన అనుభవాలను, వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకున్నారు. సుమారు 23 సంవత్సరాల సినీ కెరీర్‌లో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, తెలుగు, కన్నడ సినీ ప్రపంచంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

ప్రేమ తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, “నిజంగా కష్టపడ్డాను. అద్భుతమైన అనుభూతి” అని పేర్కొన్నారు. మొదట తెలుగు భాష మాట్లాడడం చాలా కష్టంగా ఉండేదని, దర్శకుడు కోడి రామకృష్ణ గారు తనకు తెలుగు నేర్పించారని తెలిపారు. అప్పట్లో నటీనటులకు క్యారవాన్‌లు లేవని, సెట్‌లో అందరూ ఒకే గదిలో కూర్చునేవారని, ప్రస్తుతమున్నంత సౌకర్యాలు లేవని చెప్పారు. వెంకటేష్, మోహన్ బాబు, జగపతి బాబు వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని, వారి క్రమశిక్షణ, పని పట్ల అంకితభావం తనని ఎంతో ప్రభావితం చేశాయని వివరించారు. ముఖ్యంగా మోహన్ బాబు, విష్ణువర్ధన్‌ల క్రమశిక్షణ, సమయపాలన గురించి ప్రస్తావించారు.

తన తల్లి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చానని, వాస్తవానికి ఎయిర్ హోస్టెస్‌ కావాలనే కోరిక ఉండేదని ప్రేమ వెల్లడించారు. “ఓం” అనే కన్నడ చిత్రం తన కెరీర్‌కు మలుపు అని, అది సిల్వర్ జూబ్లీ విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో ప్రారంభంలో ఎన్నో స్ట్రగుల్స్‌ను ఎదుర్కొన్నానని, అది “రెడ్ కార్పెట్” ప్రవేశం కాదని స్పష్టం చేశారు. ఉపేంద్ర దర్శకత్వంలో నటించడం ఒక సవాలుతో కూడుకున్నదని, ఆయన సహజమైన నటనను రాబట్టడానికి తీవ్రమైన సన్నివేశాలు చిత్రీకరించారని, గ్లాస్ పీసులు, ఫైర్ వంటి వాటి మధ్య నటించాల్సి వచ్చిందని తెలిపారు. ఆ అనుభవం తనను మరింత దృఢంగా మార్చిందని చెప్పారు.

“దేవి” వంటి ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఒక ట్రెండ్‌ను సృష్టించాయని, హీరోయిన్‌కు అంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కూడా సినిమాను విజయవంతం చేయవచ్చని నిరూపించిందని ప్రేమ పేర్కొన్నారు. ఆ పాత్ర కోసం లెన్స్‌లు ధరించడం వల్ల “దేవి పుత్రుడు” చిత్రం సమయంలో కళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చిందని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

Follow Us