- Telugu News Photo Gallery Cricket photos India qualify for semis without net run rate tension t20 world cup 2026
నెట్ రన్‌రేట్‌తో పనే లేదు.. జస్ట్ ఈ ఒక్కటి చేస్తే చాలు.. భారత్‌ను సెమీస్ చేరకుండా అడ్డుకునే దమ్ముందా..?
India Cricket Semis Scenario: టీ20 వరల్డ్ కప్ 2026 లో భారత్ సెమీస్ కు నేరుగా వెళ్లడానికి నెట్ రేట్ (Net Run Rate) కూడా అవసరం లేదు. ఇందుకోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు మరో పని చేయాల్సి ఉంది. ఇలా జరిగితే నెట్ రన్ రేట్ తో పని లేకుండా టీ20 ప్రపంచకప్ 2026 సెమీస్ చేరుకోవచ్చు.
Updated on: Feb 27, 2026 | 11:17 AM

స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కు టీం ఇండియా రాచ మార్గంలో చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంటే ఇతర జట్లతో నెట్ రన్ రేట్ పంచాయతీ లేకుండా నేరుగా విన్నింగ్ పాయింట్స్ తోనే సెమిస్ లో అడుగు పెట్టాలని ఆశపడుతున్నారు. ఇలా జరగాలంటే భారత ముందు ఒకే ఒక బెస్ట్ ఛాయిస్ ఉంది. అదేంటో ఓసారి చూద్దాం..

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆరంభం అదిరింది. ఓటమి అనేది ఎరగకుండా సూపర్ 8కు చేరుకుంది. కానీ కీలక సమయంలో సౌత్ ఆఫ్రికా చేతులో ఏకంగా 76 పరుగుల తేడాతో ఓడి సెమిస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

అదే సమయంలో జింబాబ్వేను వెస్టిండీస్ ఏకంగా 100 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించడం టీమిండియా సెమిస్ ఛాన్స్ ను మరింత క్లిష్టంగా మార్చింది. అయితే, భారత జట్టు జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ప్రస్తుత వెస్టిండీస్ +1.791 అలాగే సౌతాఫ్రికా +2.890 నెట్ రన్ రేట్ తో కలిగి ఉన్నాయి. ఇక టీం ఇండియా -0.100 నెట్ రన్ రేట్ తో కొనసాగుతుంది. కాబట్టి దీని ఆధారంగా సెమీస్ కు చేరడం కష్టమే.

అయితే, ఈ నెట్ రన్ రేట్ తో అవసరం లేకుండా టీం ఇండియా సెమిస్ చేరాలంటే మార్చి 1న వెస్టిండీస్ జట్టుతో జరిగే మ్యాచ్ ను గెలిస్తే చాలు. సింపుల్ గా టీమిండియా సెమీస్ చేరుతుంది. అప్పుడు టీం ఇండియా ఖాతలో నాలుగు పాయింట్లు చేరుతాయి. వెస్టిండీస్ రెండు పాయింట్ల వద్ద ఆగిపోతుంది. ఇలా నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండానే టీం ఇండియా ఈజీగా సెమిస్ కు చేరుకుంటుంది. అలాగే నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా టీం ఇండియా మరో విధంగా సెమి చేరే అవకాశం ఉంది. టీం ఇండియా తర్వాత రెండు మ్యాచుల విజయం సాధిస్తే నాలుగు పాయింట్లు పొందుతుంది.

ఈ క్రమంలోనే టీం ఇండియా ఆటగాళ్ళు నెట్ రన్ రేట్ గురించి ఆందోళన చెంది ఒత్తిడికి గురి కావద్దని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. కూల్ గా ఆడి తర్వాత రెండు మ్యాచులో విజయం సాధిస్తే చాలు విజయంపై మాత్రమే దృష్టి సారించాలని సలహా ఇచ్చాడు. రన్ రేట్ ఒత్తిడితో ఆటగాళ్ళు బారీ షాట్లకు ప్రయత్నించి విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మరింత ప్రమాదకరం అందుకే కేవలం గెలుపుపై ఫోకస్ చేయాలని అశ్విన్ సూచించాడు.
