AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Liquor Policy Case: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్‌ రిలీఫ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ CBI కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు సహా ఇతర నిందితులందరి పైన సిబిఐ నమోదు చేసిన కేసుల అన్నింటిని కొట్టివేస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.

Delhi Liquor Policy Case: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్‌ రిలీఫ్
Delhi Liquor Policy Case (2)
Anand T
|

Updated on: Feb 27, 2026 | 11:57 AM

Share

గత కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో మొత్తం 23 మందిపై ఉన్న అభియోగాలను తొలగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇందులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీస్ సిసోడియా సహా మాజీ ఎమ్మల్సీ కవిత కూడా ఉన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా దర్యాప్తులో లోపాలున్నాయంటూ CBIని కోర్టు తప్పుబట్టింది. కేసు నమోదు, దర్యాప్తులో దర్యాప్తు సంస్థ CBI అనుసరించిన విధానాన్ని సైతం కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 45 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా ఈ కేసులో ఉన్న నిందితులకు క్లీన్ చిట్ ఇస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేంద్ర సింగ్ తిర్పు వెలువరించారు.

కవిత ఎప్పుడు అరెస్ట్ అయ్యారు.

ఇక ఢిల్లీ లక్కర్ స్కామ్ కేసులో నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిను మార్చి 15, 2024న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను హైదరాబాద్‌ నుంచి ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. అయితే ఆమె ఈడీ కేసులో అరెస్టై జైల్‌లో ఉన్నప్పుడే ఏప్రిల్ 11న సీబీఐ కూడా మెరును అరెస్ట్ చేసింది.

కవితకు బెయిల్ ఎప్పుడు వచ్చింది.

ఈ కేసుపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసులపై విచారణ జరిపిన ధర్మాసనం ఆమెకు ఆగస్టు 27, 2024న బెయిల్ ఇచ్చింది. దీంతో సుమారు దాదాపు 5 నెలల జైలు జీవతం తర్వాత ఆమె విడుదలై బయటకు వచ్చారు. ఇక తాజాగా ఈకేసుతో వారికి ఎలాంటి సంబంధం లేదని.. సీబీఐ దర్యాప్తులో తప్పులు ఉన్నాయని భావించిన కోర్టు వారికి క్లీన్ చీట్ ఇస్తూ తీర్పు వెలువురించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..
ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..
సముద్రపు లోతుల్లోకి సరికొత్త శక్తి.. నేవీలోకి చేరనున్న INS నిపుణ్
సముద్రపు లోతుల్లోకి సరికొత్త శక్తి.. నేవీలోకి చేరనున్న INS నిపుణ్
రాసిపెట్టుకోండి.. భారత్ WTC ఫైనల్ చేరడం పక్కా..
రాసిపెట్టుకోండి.. భారత్ WTC ఫైనల్ చేరడం పక్కా..
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..
వెన్న లేకుండానే మీగడతో ఇలా స్వచ్చమైన నెయ్యి తయారు చేయండి!
వెన్న లేకుండానే మీగడతో ఇలా స్వచ్చమైన నెయ్యి తయారు చేయండి!
ఆ విషయంలో ముదిరిన వివాదం.. చెన్నైకు ధోని గుడ్ బై?
ఆ విషయంలో ముదిరిన వివాదం.. చెన్నైకు ధోని గుడ్ బై?
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.
15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.
జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..
జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..