AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oil-Free Chicken: ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?

ఈ మధ్య చాలా మంది ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. అందుకే బరువు తగ్గాలని, స్లిమ్‌గా కనిపించాలని అనుకుంటున్నారు. ఇందుకోసం జిమ్‌కు వెళ్లడం, టైడ్స్ ఫాలో అవ్వడం చేస్తున్నారు. అందుకే ఆల్‌ఫ్రీ ఫుడ్స్ తినేందుకు చాలా మంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి అయిల్ లేకుండా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

Oil-Free Chicken: ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
Oil Free Spicy Chicken Recipe
Anand T
|

Updated on: Feb 27, 2026 | 1:37 PM

Share

చికిన్ తినడం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే.. దానిలోనూ ఫ్రైడ్ చికెన్, చికెన్ కర్రీ తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. కానీ ఈ మధ్య కాలంలో బరువు తగ్గాలనే ఉద్దేశంతో అయిల్ ఫుడ్స్ తినేందుకు చాలా మంది వెనకాడుతున్నారు. ఈ క్రమంలోనే తమకు ఎంతో ఇష్టమైన చికెన్‌ను కూడా దూరం పెడుతున్నారు. అలాంటి వారికి కోసం ఈ రెసిపీ. ఈ రెసిపీలో మీరు చుక్క ఆయిల్ కూడా లేకుండా చికెన్ కర్నీని టేస్టీ టేస్టీగా చేసుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం పదండి.

ఆయిల్ ఫ్రీ చికెన్‌కు కావాల్సిన పదార్థాలు

చిన్న ముక్కలుగా కొట్టిన కేజీ చికెన్, తరిగిన 6 మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, 4 కాశ్మీరీ మిరపకాయలు, పడికెడు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీరెమ్ మీరెమ్ పౌడర్, 1/2 టీస్పూన్ పసుపు పొడి, 1/2 టీస్పూన్ కాశ్మీరీ మిరప పొడి, 2 టేబుల్ స్పూన్లు వెనిగర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , 1 టీస్పూన్ టమోటా కెచప్, 1/2 కప్పు సన్నగా తరిగిన తాజా కొత్తిమీర, రుచికి సరపడా ఉప్పు,

ఆయిల్ ఫ్రీ చికెన్ తయారీ విధానం

ముందుగా చికెన్‌ను బాగా కడిగి, నాన్ స్టిక్ పాత్రలో ఉంచండి. తర్వాత కొత్తిమీర ఆకులు తప్ప పైన పేర్కొన్న అన్ని పదార్థాలను చికెన్‌లో కలపండి. బాగా కలపిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని అన్ని చికెన్ ముక్కలను గుచ్చండి, దీని ద్వారా మీరు దట్టించిన మసాల ముక్కలోపలికి వెళ్తుంది. తర్వాత ఆ చికెన్ పెట్టిన పాత్ర మూతపెట్టి, కనీసం 30 నిమిషాలు లేదా గంట వరకు ఫ్రిజ్‌లో మ్యారినేట్ చేయండి.

తర్వాత ఫ్రిజ్ నుంచి తీసి పాత్రలో 1/4 కప్పు నీరు పోసి మూత పెట్టండి. స్టవ్ అన్‌ చేసి దానిపై ఉంచండి. దాదాపు 10 నిమిషాల తర్వాత, ముక్కల నుంచి నీరు బయటకు వస్తుంది. అప్పుడు వాటికి ఉప్పు, వెనిగర్, మసాలా వంటివి ఏమైనా అవసరమా అని చూడండి. అవసరమైతే ఇప్పుడే కవాల్సిన పదార్థాలు వేసి బాగా కలపండి. గ్యాస్ ని హై-ఫ్లేమ్ మీద పెట్టి, మూత తెరిచి ఉడికించనివ్వండి. గ్రేవీ చిక్కగా అవ్వడం ప్రారంభించగానే, తరిగిన కొత్తిమీరను చికెన్ లో వేసి బాగా కలపండి. గ్రేవీ అంతా చిక్కగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే వేడి వేడి, టేస్టీ టేస్టీ ఆయిల్ ఫ్రీ చికెన్ రోస్ట్ సిద్దం అయినట్టే. దీనిని మీరు ఒక ప్లేట్‌లోకి సర్వ్ ఆస్వాధించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
సర్దిచెప్పేందుకు వెళ్లి చావు కొని తెచ్చుకున్న యువకుడు..!
సర్దిచెప్పేందుకు వెళ్లి చావు కొని తెచ్చుకున్న యువకుడు..!
9 నంది అవార్డులు రాబట్టిన తెలుగు సంచలన చిత్రం ఏదంటే..?
9 నంది అవార్డులు రాబట్టిన తెలుగు సంచలన చిత్రం ఏదంటే..?
గంభీర్ జర జాగ్రత్త.. ఈ పొరపాటు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే..?
గంభీర్ జర జాగ్రత్త.. ఈ పొరపాటు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే..?
చుట్టపుచూపుగా వచ్చి.. దారుణహత్యకు గురైన వృద్ధుడు!
చుట్టపుచూపుగా వచ్చి.. దారుణహత్యకు గురైన వృద్ధుడు!
దీనిని పెరుగులో కలిపి రాసుకుంటే క్షణాల్లో తెల్ల జుట్టు మాయం!
దీనిని పెరుగులో కలిపి రాసుకుంటే క్షణాల్లో తెల్ల జుట్టు మాయం!