AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushmita Sen: గుండెపోటు తర్వాత సుస్మితా సేన్ ‘విశ్వరూపం’.. జిమ్‌లో కండలు చూపిస్తూ 3 ఏళ్ల విజయోత్సవం

సినిమా తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఆమె ఒక పోరాట యోధురాలు. గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యను ఎదుర్కొని, దానిపై విజయం సాధించి మళ్ళీ మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతోంది. మూడు సంవత్సరాల క్రితం మృత్యువు అంచులకు వెళ్లి వచ్చిన ఈ మాజీ విశ్వసుందరి.

Sushmita Sen: గుండెపోటు తర్వాత సుస్మితా సేన్ ‘విశ్వరూపం’.. జిమ్‌లో కండలు చూపిస్తూ 3 ఏళ్ల విజయోత్సవం
Susmitha Sen
Nikhil
|

Updated on: Feb 27, 2026 | 6:15 AM

Share

ఇప్పుడు తన ఫిట్‌నెస్‌తో ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతోంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం నిండిన ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఆమె అందం ప్రపంచవ్యాప్తం.. ఆమె ధైర్యం అనంతం. 30 ఏళ్ల క్రితం మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుని భారతీయ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసింది. కానీ మూడు సంవత్సరాల క్రితం ఆమె జీవితంలో ఒక చీకటి రోజు ఎదురైంది. ఊహించని విధంగా గుండెపోటు రావడంతో ఆమె ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే, ఆమె మరణాన్ని జయించి మళ్ళీ తన పాదాలకు పని చెప్పింది. తాజాగా తన ఫిట్‌నెస్ వీడియోను షేర్ చేస్తూ, తనకు పునర్జన్మ లభించి మూడు ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని జరుపుకుంటున్న ఆ ధీరవనిత మరెవరో కాదు.. సుస్మితా సేన్.

సుస్మితా సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పవర్‌ఫుల్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె జిమ్‌లో కఠినమైన వర్కవుట్లు చేస్తూ, స్విమ్మింగ్ చేస్తూ, తన టోన్డ్ బాడీని ప్రదర్శించింది. “థ్యాంక్యూ గాడ్.. #3years” అంటూ తన కృతజ్ఞతను చాటుకుంది. గుండెపోటు తర్వాత తన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా మలచుకుందో ఈ వీడియో నిరూపిస్తోంది. “నో ఎక్స్‌క్యూజ్.. జస్ట్ రిజల్ట్” (సాకులు వద్దు.. ఫలితమే ముఖ్యం) అనే సందేశంతో తన అభిమానులలో స్ఫూర్తిని నింపింది.

వంశపారంపర్య సమస్యలు..

గతంలో ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యల గురించి సుస్మితా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన తల్లిదండ్రులు ఇద్దరికీ గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని, అందుకే తనకు కూడా ఈ సమస్య ఎదురైందని చెప్పింది. “నేను క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా, జన్యుపరమైన సమస్యలను పూర్తిగా ఆపలేము. కానీ నేను ఫిట్‌గా ఉండటం వల్లే ఆ ప్రమాదం నుండి త్వరగా కోలుకోగలిగాను. నేను ప్రాణాలతో బయటపడటం దేవుడిచ్చిన గొప్ప వరం” అని ఆమె పేర్కొంది.

గుండెపోటు తర్వాత ఆమె ఫిట్‌నెస్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. మొదట్లో కేవలం వార్మప్స్, స్ట్రెచెస్ వంటి తేలికపాటి వ్యాయామాలకే పరిమితమైంది. నెమ్మదిగా వెయిట్ ట్రైనింగ్, బ్రిస్క్ వాకింగ్ వంటివి చేస్తూ తన సామర్థ్యాన్ని పెంచుకుంది. “మీ శరీరం ఏ రోజు ఎంత వరకు సహకరిస్తుందో వినడం ముఖ్యం” అని ఆమె తన అనుభవాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఆమె రన్నింగ్ చేయకపోయినా, వేగంగా నడవడం ద్వారా తన హృదయ స్పందనను క్రమబద్ధీకరించుకుంటోంది.

‘ఏరియా 3’ సంచలనం..

ఆరోగ్య సమస్యల నుండి కోలుకున్న కేవలం ఒక నెల లోపే సుస్మితా సేన్ ‘ఏరియా 3’ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంది. అందులో క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సిరీస్ ఇంటర్నేషనల్ ఎమ్మీ నామినేషన్ పొందడం విశేషం. తన కెరీర్‌లో ఇది ఒక కొత్త అధ్యాయమని, మళ్ళీ షూటింగ్ సెట్‌కు రావడం తనకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది. వయసుతో సంబంధం లేకుండా, వచ్చిన కష్టాలను ఎదురించి నిలబడటమే అసలైన గెలుపు అని సుస్మితా సేన్ నిరూపిస్తోంది. 50 ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్నా, ఆమె చూపిస్తున్న ఈ తెగువ ప్రతి ఒక్కరికీ ఆదర్శం.

Follow Us