కప్పు కాఫీతో మీ లివ‌ర్‌కు కొండంత రక్ష.. ఎలా తీసుకోవాలంటే?

26  February 2026

TV9 Telugu

TV9 Telugu

ఉదయం నిద్ర లేచిన వెంటనే కప్పు కాఫీ వేడి వేడిగా తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. నిద్ర మత్తును చిటికెలో వదిలించి ఉత్సాహాన్ని ఇచ్చే కాఫీ ప్రతి రోజూ సిద్ధంగా ఉండాల్సిందే

TV9 Telugu

అయితే ఉద‌యం పూట బ్లాక్ కాఫీ ఎప్పుడైనా తాగారా? బ్లాక్ కాఫీతో బోలెడన్ని లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శ‌రీరంలో శ‌క్తిని, చుర‌కుద‌నాన్ని ఇది పెంచుతుందట

TV9 Telugu

ఒత్తిడిని త‌గ్గించి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో బ్లాక్ కాఫీ ఎంతో చ‌క్కగా ప‌ని చేస్తుంది. అయితే బ్లాక్ కాఫీ కాలేయ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది

TV9 Telugu

బ్లాక్ కాఫీ తీసుకోవ‌డం వ‌ల్ల ఫ్యాటీ లివ‌ర్‌ వ్యాధితో పాటు కాలేయానికి న‌ష్టం క‌లిగే విషాల నుంచి రక్షణ లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు

TV9 Telugu

బ్లాక్ కాఫీ క్రమం త‌ప్పకుండా రోజుకు రెండు, మూడు క‌ప్పులు తాగే వారిలో కాలేయ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. కాఫీ ఆరోగ్యక‌ర‌మైన కాలేయ ఎంజైమ్ స్థాయిల‌ను పెంచ‌డంలో సహాయపడుతుందట

TV9 Telugu

బ్లాక్ కాఫీ తాగ‌డం వ‌ల్ల ATL, AST, GGTP వంటి ఎంజైమ్‌లు స్థాయిలు పెరిగి కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అలాగే ఇప్పటికే కాలేయ స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారు బ్లాక్ కాఫీ తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని ప‌రిశోధ‌న‌లు వెల్లడించాయి

TV9 Telugu

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివ‌ర్, ఆల్కహాలిక్ సంబంధిత ఫ్యాటీ లివ‌ర్ సమ‌స్యల‌తో బాధ‌ప‌డే వారు రోజుకు రెండు కంటే ఎక్కువ క‌ప్పుల బ్లాక్ కాఫీ తీసుకుంటే ఫైబ్రోసిస్, సిర్రోసిస్, లివ‌ర్ క్యాన్సర్ వంటి ప్రమాదాలు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని కొన్ని అధ్యయ‌నాలు చెబుతున్నాయి

TV9 Telugu

బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ల‌క్షణాలు, స‌హ‌జ స‌మ్మేళ‌నాలు, పాలీఫినాల్స్ కాలేయ క‌ణాల‌ను ర‌క్షించ‌డంలో, జీవ‌క్రియ ప్రక్రియ‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి