కండరాలు లడ్డూల్లా మార్చే అద్భుత ఆయుర్వేద మూలిక!

26 February 2026

Jyothi Gadda

అశ్వగంధ అంటే గుర్రం వాసన అని అర్థం. ఎందుకంటే ఈ మూలిక వాసన ప్రత్యేకంగా ఉంటుంది. అశ్వగంధ మొక్క ఇండియా, ఉత్తర ఆఫ్రికాలో కనిపిస్తుంది. దీని వేర్లు, ఆకుల్ని ఔషధాల్లో వాడుతారు.

అశ్వగంధ అంటే గుర్రం వాసన అని అర్థం. ఎందుకంటే ఈ మూలిక వాసన ప్రత్యేకంగా ఉంటుంది. అశ్వగంధ మొక్క ఇండియా, ఉత్తర ఆఫ్రికాలో కనిపిస్తుంది. దీని వేర్లు, ఆకుల్ని ఔషధాల్లో వాడుతారు.

మాటిమాటికీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటే... అలాంటి వారు అశ్వగంధను వాడొచ్చు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మనలో ఎనర్జీ లెవెల్స్ పెంచగలదు. కంటి చూపును మెరుగుపరచగలదు.

అశ్వగంధలోని వితాఫెరిన్ అనే పదార్థం కాన్సర్‌ను అడ్డుకోగలదని పరిశోధనల్లో తేలింది. రకరకాల కాన్సర్లకు ఇది మందులా పనిచేస్తోంది. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ విడుదలను క్రమం చేస్తుంది.

మీకు టెన్షన్లు, ఒత్తిడి, కంగారు, ఆందోళన, హడావుడి, బిజీ లైఫ్ స్టైల్ ఉంటున్నట్లైతే... మీరు అశ్వగంధ వాడటం మేలు. ఇది మీకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మీ బ్రెయిన్‌ని కాపాడుతుంది.

కొంతమంది అంతా అయిపోయిందనీ, ఇక చావడమే మేలని ఇలా నెగెటివ్ ఆలోచనలను పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వారు అశ్వగంధ వాడితే... పాజిటివ్ అయిపోతారు. డిప్రెషన్ తగ్గి భవిష్యత్తుపై ఆశలు పెరుగుతాయి. 

పిల్లలు పుట్టని మగవారికి సరైన మందు ఈ అశ్వగంధ. శుక్రకణాల సంఖ్య పెంచడంలో ఈ మూలికకు తిరుగులేదు. వరుసగా 3 నెలలు అశ్వగంధను రోజూ తీసుకుంటే, పిల్లలు పుట్టే అవకాశాలు బాగా పెరుగుతాయి.

శరీర నిర్మాణం, కండరాల్లో బలం పెంచడంలో అశ్వగంధకు మంచి పేరుంది. మగవారు రోజుకు 750mg చొప్పున 30 రోజులు తీసుకుంటే... కండరాలు రాడ్డుల్లా తయారవుతాయి.

శరీరంలో వేడిని కంట్రోల్ చెయ్యడంలో అశ్వగంధ బాగా పనిచేస్తుంది. తద్వారా వ్యాధి నిరోధక శక్తి నిలిచివుండేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. గుండెకు రక్త సరఫరా సరిగా అయ్యేలా చేసిచ, గుండెకు మేలు చేస్తుంది.