రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
26 February 2026
TV9 Telugu
TV9 Telugu
నిద్ర లేచిన వెంటనే నీళ్లు నీరు తాగడం మనలో చాలా మందికి అలవాటు. అయితే కొందరు టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఈ రెండింటికి బదులుగా కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..
TV9 Telugu
ఉదయం నిద్ర లేచే సమయానికి చాలా వరకు శరీరం డీహైడ్రేటెడ్ గా ఉంటుంది. కొబ్బరినీళ్లల్లో పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ శరీరం త్వరగా హైడ్రేట్ అవడానికి సహాయం చేస్తుంది
TV9 Telugu
ఉదయం పూట కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అలసట తక్కువగా ఉంటుందని, ఒత్తిడి లేకుండా జీర్ణవ్యవస్థను మేల్కొలపడానికి ఇది సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఉదయం ప్రేగు కదలికలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా కొబ్బరి నీరు కణాల హైడ్రేషన్ ను ప్రోత్సహిస్తుంది. ఆక్సిజన్, పోషకాలు శరీరమంతా సమర్థవంతంగా సరఫరా కావడంలో సహాయపడుతుంది
TV9 Telugu
ఈ నీటిలో సహజంగానే పొటాషియంను ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇది సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కాలక్రమేణా రక్తపోటు స్థాయిలు పెరగకుండా ఇది సహాయపడుతుంది
TV9 Telugu
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినని వారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తగినంత పొటాషియం అంది రక్తపోటు స్థాయిలు పెరగకుండా ఉంటాయి. పైగా చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది
TV9 Telugu
కొబ్బరి నీటిని తాగడం వల్ల ఉదయం అల్పాహారం తీసుకునే మోతాదు తగ్గడంతో పాటు చక్కెర పానీయాలు తీసుకోవాలనే కోరిక కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో సులువుగా బరువు తగ్గొచ్చు
TV9 Telugu
అయితే కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వీటిని కూడా మితంగానే తీసుకోవాలి. ఎక్కువ పొటాషియం స్థాయిలతో బాధపడే వారు మూత్రపిండాల సమస్యతో బాధపడే వారు, డయాబెటిస్ తో బాధపడే వారు ఈ నీటిని తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి