AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Indian Idol Season 3: తను నవ్వుతుంటే అలా చూస్తూ ఉండిపోతా.. ఇండియన్ ఐడల్ షోలో విజయ్ దేవరకొండ.

Aha OTT-Vijay Deverakonda: ఇప్పుడు తన రాబోయే ప్రాజెక్ట్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న విజయ్.. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి అతిథిగా వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ షో స్టేజ్ పై విజయ్ ఎప్పటిలాగే ఫుల్ సందడి చేసినట్లుగా తెలుస్తోంది.

Telugu Indian Idol Season 3: తను నవ్వుతుంటే అలా చూస్తూ ఉండిపోతా.. ఇండియన్ ఐడల్ షోలో విజయ్ దేవరకొండ.
Vijay Deverakonda
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2024 | 12:30 PM

Share

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్‏లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయల కలల రాకూమారుడు. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విజయ్.. తాజాగా కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి సినిమాలో అర్జునుడిగా గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు తన రాబోయే ప్రాజెక్ట్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న విజయ్.. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి అతిథిగా వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ షో స్టేజ్ పై విజయ్ ఎప్పటిలాగే ఫుల్ సందడి చేసినట్లుగా తెలుస్తోంది.

అర్జున్ రెడ్డి బీజీఎంతో స్టేజ్ పైకి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఆ వెంటనే సింగర్ కార్తీక్ మాట్లాడుతూ.. పండగలకు చేస్తారు సెలబ్రేషన్స్.. విజయ్ దేవరకొండ ఒక సెన్సెషన్ అంటూ హైప్ ఇచ్చాడు. దీంతో ఇది ఒరిజినల్ ఆ అని విజయ్ డౌట్ పడగా.. ప్రాపర్లీ డూప్లీకేటెడ్ ఒరిజినల్ ప్రో అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు థమన్. ఆ తర్వాత కంటెస్టెంట్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఓ లేడీ కంటెస్టెంట్ గురువు అంటూ చిన్నపిల్లాడిని స్టేజ్ పైకి తీసుకువచ్చారు. ఆ బాబుతో థమన్, కార్తీక్, విజయ్ దేవరకొండ కామెడీ చేసి క్రికెట్ ఆడారు. విజయ్ దేవరకొండ హీరో కాబట్టి గురూజీ అని పిలుస్తున్నా అంటూ ఆ చిన్నోడు చెప్పడం నవ్వులు పూయించింది. కాసేపు ఆ బాబుతో కలిసి క్రికెట్ ఆడగ్గా.. చిటింగ్ చేస్తూ ఆ బాబును ఆటపట్టించాడు థమన్.

ఇక ఆ తర్వాత స్కంద అనే కంటెస్టెంట్ విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సినిమాలోని ఇంకేమ్ ఇంకేమ్ కావాలి సాంగ్ పడి మెప్పించాడు. ఆ తర్వాత స్టేజ్ పై తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కూడా తన తల్లితో ఉన్న బాండింగ్ గుర్తుచేసుకున్నాడు. “దేవుడికి థాంక్స్ చెప్పాలి. మనకు అమ్మలను ఇచ్చినందుకు. మా అమ్మ నవ్వుతూ హ్యాపీగా ఉంటే నేను అన్ని పనులు ఆపేసి అలాగే చూస్తుంటాను” అని అన్నాడు. ఇక ఆ తర్వాత కేశవ్ అనే కంటెస్టెంట్ పాటకు ఫిదా అయిన కార్తిక్ అతడిని తన బ్యాండ్ లో జాయిన్ అవుతావా అంటూ ఆఫర్ ఇచ్చాడు. అలాగే తన పేరెంట్స్ వీడియో మెసేజ్ తెప్పించి సర్ ప్రైజ్ చేశాడు విజయ్. ఇక మరో కంటెంస్టెంట్ మణిశర్మ కంపోజ్ చేసిన పాటను అద్భుతంగా పాడడంతో వీడియో రికార్డ్ చేసి మణిశర్మకు పంపించారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఇండియన్ ఐడల్ షోలో విజయ్ దేవరకొండ సందడి చేయడంతో ప్రస్తుతం ఈ ప్రోమో వైరలవుతుంది.

ప్రోమో చూడండి.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.