Nandamuri Mokshagna: ఆ పాన్ ఇండియా డైరెక్టర్ చేతుల మీదుగా మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య ప్లాన్ మాములుగా లేదుగా

నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి గత కొన్నేళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. లెజెండ్ సినిమా నుంచే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అదేమీ జరగలేదు. దీనికి తోడు మోక్షజ్ఞ కాస్త బొద్దుగా మారడంతో అసలు సినిమాల్లోకి వస్తాడా? అని కొందరు అనుమానాలు వ్యక్తంచేశారు.

Nandamuri Mokshagna: ఆ పాన్ ఇండియా డైరెక్టర్ చేతుల మీదుగా మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య ప్లాన్ మాములుగా లేదుగా
Nandamuri Mokshagna
Follow us
Basha Shek

|

Updated on: Jul 02, 2024 | 9:49 PM

నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి గత కొన్నేళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. లెజెండ్ సినిమా నుంచే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అదేమీ జరగలేదు. దీనికి తోడు మోక్షజ్ఞ కాస్త బొద్దుగా మారడంతో అసలు సినిమాల్లోకి వస్తాడా? అని కొందరు అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే వీటన్నింటికి తెరదించుతూ ఇండస్డ్రీలోకి వస్తున్నానంటూ మోక్షజ్ఞనే స్వయంగా ప్రకటించారు. అంతేకాదు స్లిమ్ గా , స్టైలిష్ గా మారిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీటిని చూసిన నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఏ డైరెక్టర్‌తో మోక్షజ్ఞని లాంఛ్ చేస్తారా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే..మోక్షజ్ఞ డెబ్యూ చిత్రాన్ని హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తారట. హనుమాన్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తేనే బావుంటుందని బాలయ్య భావిస్తున్నారట.

ఆహా అన్ స్టాపబుల్ షోలో ప్రశాంత్ వర్మ- బాలయ్య కలిసే పని చేశారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే తన ‘హనుమాన్’ విడుదలయిన తర్వాత బాలయ్య కోసం ఒక స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు ప్రశాంత్ వర్మ. దీనిని చూసిన బాలయ్య యంగ్ డైరెక్టర్ ట్యాలెంట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు మోక్షజ్ఞను కూడా ప్రశాంత్ వర్మ చేతుల మీదుగానే లాంచ్ చేయిస్తే బాగుంటుందని నందమూరి నట సింహం భావిస్తున్నారట. అంతేకాదు మోక్షజ్ఞ మూవీలో బాలయ్య కూడా ఒక స్పెషల్ రోల్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవల రూమర్లు మాత్రమే. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నందమూరి అభిమానులకు పండగే.

ఇవి కూడా చదవండి

నందమూరి  మోక్షజ్ఞ ట్వీట్.. ఇదిగో..

నందమూరి బాలకృష్ణతో ప్రశాంత్ వర్మ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.