- Telugu News Photo Gallery Cinema photos Vijay Devarakonda And Rashmika Mandanna Likely To Act Together Again In Rahul Sankrityayan Movie
Vijay Devarakonda- Rashmika: విజయ్ దేవరకొండ- రష్మికలపై మరో కొత్త రూమర్.. అతని కోసం మళ్లీ కలవనున్న లవ్ బర్డ్స్
Vijay Devarakonda- Rashmika Mandanna : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తొలిసారి జంటగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఈ సినిమాతోనే ఇద్దరూ బాగా ఫేమస్ అయ్యారు. టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
Updated on: Jul 02, 2024 | 9:25 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి జంటగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఈ సినిమాతోనే ఇద్దరూ బాగా ఫేమస్ అయ్యారు. టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఇందులోను రష్మిక- విజయ్ జోడికి మంచి పేరొచ్చింది. అయితే ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించాల్సి ఉండేది. అయితే కొన్ని కారణాలతో ఆ పాత్రను మృణాల్ ఠాకూర్‌కి ఇచ్చారు

ఇప్పుడు 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న, విజయ్ లను హీరో, హీరోయిన్లుగా తీసుకోవాలని భావిస్తున్నాడట.

రాహుల్ దర్శకత్వం వహించనున్న కొత్త సినిమాలో కథానాయిక పాత్ర రాయలసీమ ప్రాంత నేపథ్యంలో సాగనుంది. రష్మిక మందన్న ఇప్పటికే 'పుష్ప' సినిమాలో అలాంటి పాత్ర చేసింది.

దీంతో రాహుల్ తన కొత్త సినిమాలో ఆ పాత్రను రష్మిక మందన్నా చేస్తే బాగుంటుందని చిత్ర బృందం భావించింది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి విజయ్ దేవరకొండ కానీ, రష్మిక మందన్న కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు.





























