Danush: ధనుష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.? సూర్య స్క్రిప్ట్ ఆయనకి షిఫ్ట్.?
హీరో ధనుష్ సెలక్షన్ గురించి ఇప్పుడు కోలీవుడ్‌లో ఇంట్రస్టింగ్ చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా ధనుష్ సెలక్ట్ చేసుకుంటున్న కెప్టెన్ల గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు జనాలు. రీసెంట్‌గా ఈ కెప్టెన్సీ లిస్టులో సుధ కొంగర పేరు హైలైట్ అవుతోంది. మరి ధనుష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమితోనేనా.? సూర్య స్క్రిప్ట్ స్క్రిప్ట్ నే డీల్ చేస్తారా.? అనే విషయాలు గురించి ఈ రోజు తెలుసుకుందాం..
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Jul 03, 2024 | 8:42 AM

ఈ ఏడాది ఆల్రెడీ కెప్టెన్ మిల్లర్‌తో జనాలను పలకరించారు ధనుష్. ఆ సినిమా అనుకున్నస్థాయిలో బంపర్ హిట్ కాలేదు. అందుకే శ్రద్ధగా రాయన్ మీద ఫోకస్ పెట్టారు. రాయన్ సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు.

అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే, జూన్‌లోనే విడుదల కావాల్సింది రాయన్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా మూవీ వాయిదాపడింది. ధనుష్ డైరక్టోరియల్ స్కిల్స్ ని రాయన్‌లో ఈ నెల 26న మరోసారి థియేటర్లలో చూడొచ్చు ప్రేక్షకులు.

రాయన్ సినిమా తర్వాత ధనుష్ నుంచి విడుదలయ్యే సినిమా కుబేర. వైవిధ్యమైన కథలతో మెప్పిస్తారనే పేరున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జునతో కలిసి ధనుష్ చేస్తున్న కుబేర మీద మంచి హైప్ ఉంది ఇండస్ట్రీలో.

కుబేర తర్వాత ధనుష్... ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తారన్నది ఇప్పటి వరకున్న సమాచారం. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆయన సుధ కొంగర సెట్స్ కి జంప్ అవుతారట.

ఆల్రెడీ సూర్యతో ఓ సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేశారు సుధ కొంగర. ఆ ప్రాజెక్ట్ పక్కనపడింది.. మరో స్క్రిప్ట్ తో ధ్రువ్ విక్రమ్‌తో సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సుధ ఇమీడియేట్ ప్రాజెక్ట్ ధనుష్‌తోనే అనీ, సూర్య కోసం చేసిన స్క్రిప్ట్ నే డీల్ చేస్తారనీ కోలీవుడ్ టాక్.





























