- Telugu News Photo Gallery Cinema photos Those heroes say that there is no movie release unless the OTT deal is set
OTT : ఓటీటీ డీల్ సెట్ అయితే తప్ప నో రిలీజ్.. ఆ హీరోలకి డిజిటల్ కష్టాలు..
ఒకప్పుడు సినిమా రిలీజ్ అంటే నిర్మాతలు మంచి రోజులు, మంచి వసూళ్లు సాధించే సీజన్లు అని లెక్కలేసుకొని స్టార్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమా రిలీజ్‌ల విషయంలో ఓటీటీ సంస్థల నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలను ఓటీటీ సంస్థల రిలీజ్ షెడ్యూల్‌ను బట్టి థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Jul 03, 2024 | 9:09 AM

గతంలో సినిమా బిజినెస్ అంటే థియేట్రికల్ మార్కెట్ గురించే మాట్లాడుకునేవారు. ఆ తరువాత సాటిలైట్ గురించి కూడా చర్చ మొదలైంది. ఇప్పుడు ఓటీటీ బిజినెస్ ఎంట్రీతో అన్ని లెక్కలు మారిపోయాయి. ముందు డిజిటల్ బిజినెస్ అయితే తప్ప థియేట్రికల్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు.

టాప్ స్టార్స్ విషయంలో డిజిటల్ బిజినెస్‌కి ఎలాంటి ఇబ్బంది లేదు. సినిమా సెట్స్ మీద ఉండగానే బిజినెస్ అయిపోతుంది. చిన్న సినిమాలు రిలీజ్ తరువాత టాక్‌ను బట్టే ఓటీటీ మార్కెట్‌ను లెక్కలేసుకుంటున్నాయి.

కానీ రవితేజ, నాని, నాగచైతన్య, నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోల విషయంలోనే సమస్య వస్తోంది. ముందు బిజినెస్ లాక్ అయితే తప్ప రిలీజ్ థియేట్రికల్ రిలీజ్ విషయంలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి.

ఇటీవల చాలా సినిమాలు రిలీజ్ డేట్ చెప్పిన తరువాత వరుసగా వాయిదాలు పడటం వెనుక కారణం కూడా ఇదే అన్న టాక్ వినిపిస్తోంది. షూటింగ్ టైమ్‌లో టెన్టెటివ్‌గా ఓ రిలీజ్ డేట్‌ను లాక్ చేస్తున్నారు.

ఆ టైమ్‌కు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయినా... ఓటీటీ డీల్ సెట్ అయితే తప్ప రిలీజ్ డేట్‌ను లాక్ చేసే పరిస్థితి కనిపించటం లేదు. అందుకే తప్పని సరి పరిస్థితుల్లో రిలీజ్‌లు వాయిదా వేసుకుంటున్నారు.





























