- Telugu News Photo Gallery Cinema photos Actress Rashi Khanna Demands Death Sentence To Gang Molestation
Raashii Khanna: అలాంటి వారిని ఉరి తీయాలి.. రాశిఖన్నా డిమాండ్
అందాల భామలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే.. సోషల్ మీడియాలో సమాజంలో జరిగే సంఘటనల పైన కూడా స్పందిస్తూ ఉంటారు. తాజాగా హాట్ బ్యూటీ రాశి ఖన్నా కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ఘటన పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Updated on: Jul 03, 2024 | 4:14 PM

అందాల భామలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే.. సోషల్ మీడియాలో సమాజంలో జరిగే సంఘటనల పైన కూడా స్పందిస్తూ ఉంటారు. తాజాగా హాట్ బ్యూటీ రాశి ఖన్నా కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ఘటన పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి పరిచయమైంది ఈ చిన్నది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. బబ్లీ లుక్స్ తో ఆకట్టుకుంది రాశి ఖన్నా.

ఆతర్వాత వరుసగా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాశి ఖన్నా కాంట్రవర్సిలకు చాలా దూరంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు ఎలాంటి విమర్శల్లో తలదూర్చలేదు. సోషల్ మీడియాలో రాశి ఖన్నా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న చట్టాలను మార్చేసింది కేంద్ర ప్రభుత్వం.. ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలకు పాలుపడే వారికి కూడా కఠిన శిక్షలు విధించనున్నారు. మైనర్ మీద అత్యాచారం చేసే వారికి ఉరి శిక్ష, గ్యాంగ్ రేప్ చేసిన వారికి 20 ఏళ్ల జైలు శిక్ష.. విధించనున్నారు.

వీటిపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఇదే అంశంపై కామెంట్స్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇంతకు నెటిజనులు, సెలబ్రిటీలు.. అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న అంశం ఏదంటే.. గ్యాంగ్ రేప్ నిందితులకు విధించే శిక్షల అంశం. దీనిపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.




