- Telugu News Photo Gallery Cricket photos Team India Cricketer Smriti Mandhana Along With Her Family Visit Tirumala Srivari Temple
Smriti Mandhana: తిరుమల శ్రీవారి సేవలో స్మృతి మందాన.. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు.. ఫొటోస్ చూశారా?
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మందాన తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మంగళ వారం (జులై 02) ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లిన ఆమె అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం వీరి తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
Updated on: Jul 02, 2024 | 7:06 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మందాన తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మంగళ వారం (జులై 02) ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లిన ఆమె అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు స్మృతి మంధానకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు, ప్రసాదాలు అందించారు.

ప్రస్తుతం స్మృతి మంధాన తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

కాగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

చెన్నై వేదికగా జరిగిన ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్మృతి మందాన 149 పరుగులు చేసింది. అంతకు ముందు వన్డేల్లోనూ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొట్టింది.




