Mirzapur 3 OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మీర్జాపూర్ 3.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గతంలో విజయాలను అందుకున్న రెండు సీజన్ల మాదిరిగానే ఇప్పుడు మూడో సీజన్ లోనూ ఎలాంటి ట్విస్టులు ఉండనున్నాయో అని అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరికొన్ని గంటల్లో మీర్జాపూర్ 3 స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ ఒకటి. ఈ సిరీస్ కు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రైమ్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ కు యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు. ఇప్పటివరకు వచ్చిన మీర్జాపూర్ రెండు సీజన్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది. అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గతంలో విజయాలను అందుకున్న రెండు సీజన్ల మాదిరిగానే ఇప్పుడు మూడో సీజన్ లోనూ ఎలాంటి ట్విస్టులు ఉండనున్నాయో అని అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరికొన్ని గంటల్లో మీర్జాపూర్ 3 స్ట్రీమింగ్ కానుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 5న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈసిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈసారి సీజన్ 3లో మొత్తం పది ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఈసారి పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి, రసిక దుగ్గల్, రాజేష్ తైలాంగ్, షీబా చద్దా, ఇషా తల్వార్ వంటి తారలు ఈ సిరీస్‌లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మీర్జాపూర్ మొదటి సీజన్ 2018లో విడుదలైంది. రిలీజ్ అయిన వెంటనే ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 2020లో వచ్చిన రెండవ సీజన్ కూడా మంచి విజయాన్ని అందుకుంది.
సీజన్ 2 ప్రేక్షకులను ఎమోషనల్ గా కట్టిపడేసింది. గన్స్, డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది. మీర్జాపూర్ మొత్తం కాలీన్ భాయ్ (పంకజ్ త్రిపాఠి) చేతిలో ఉడంగా.. అక్కడి మాఫియా సామ్రాజ్యానికి అతడే మహారాజు. కాలీన్ భాయ్ కొడుకు మున్నా భాయ్ (దివ్యేంద్) ఓ పెళ్లి కొడుకును కాల్చి చంపేస్తాడు. ఆ కేసును లాయర్ రమాకాంత్ పండిత్ (రాజేశ్ తైలాంగ్ ) వాధిస్తాడు. కొడుకును కాపాడుకునేందుకు కాలీన్ భాయ్ భారీ ప్లాన్ వేస్తాడు. రెండవ సీజన్ ముగింపులో కాలీన్ భాయ్ కొడుకు హత్యకు గురవుతాడు. ఇప్పుడు మున్నా భయ్యా పాత్ర కొత్త సీజన్‌లో కనిపించదు. షో కథ అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి చుట్టూ తిరుగుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.