విమానయాన చరిత్రలోనే అత్యంత సురక్షితమైన సంవత్సరం 2023.. రవాణా సాధనాల్లో విమానాన్ని మించినది లేదా?
అమెరికాకు చెందిన షెఫ్ ఫీల్డ్ స్కూల్ ఆఫ్ ఏరోనాటిక్స్ వెబ్ సైట్ అందించిన వివరాల ప్రకారం ప్రపంచంలోని రవాణా సాధనాల్లో అత్యంత సురక్షితమైన రవాణా వ్యవస్థ విమానయానం. నిజానికి ఆదికాలం నుంచే మానవులు విశాలమైన వినీలాకాశం వైపు ఆకర్షితులయ్యారు.

ఎస్… మీరు చదివిన హెడ్ లైన్ ముమ్మాటికీ వాస్తవం. ఈ విషయాన్ని ధ్రువీకరించింది సాక్షాత్తు ద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ IATA. గ్లోబల్ ఏవియేషన్ విభాగంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ నివేదిక విడుదల చేసింది IATA. ఆ నివేదికలో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ ఏడాది మొత్తం మీద ప్రతి 12 లక్షల 60 వేల విమాన ప్రయాణాలకు గాను కేవలం 0.8 శాతం మాత్రమే ప్రమాదాలు నమోదయ్యాయి. ఇది 2022లో 1.3గా ఉండేది. అలాగే మరణాల సంఖ్య కూడా చాలా చాలా తగ్గింది. 1945లో కేవలం 57 ఎయిర్ లైన్స్ సంస్థలు సభ్యులుగా ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 120 దేశాలకు చెందిన 330 ఎయిర్ లైన్స్ ఇందులో సభ్యత్వం కల్గి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ ట్రాఫిక్‌లో IATAలో సభ్యత్వం ఉన్న ఎయిర్ లైన్స్ సంస్థలు 80 శాతం ప్రయాణీకుల్ని తీసుకెళ్తాయి. అమెరికాకు చెందిన షెఫ్ ఫీల్డ్ స్కూల్ ఆఫ్ ఏరోనాటిక్స్ వెబ్ సైట్ అందించిన వివరాల ప్రకారం ప్రపంచంలోని రవాణా సాధనాల్లో అత్యంత సురక్షితమైన రవాణా వ్యవస్థ విమానయానం. నిజానికి ఆదిమకాలం నుంచే మానవులు విశాలమైన వినీలాకాశం వైపు ఆకర్షితులయ్యారు. ఆకాశంలో పక్షిలా ఎగరాలని నక్షత్రాలను అందుకోవాలని కలలు కన్నారు. 1903లో విల్బర్ ఇంకా ఆలివ్ రైట్‌లు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రయాణించే విమానాన్ని ఆవిష్కరించడం ఓ అద్భుత ఘట్టం. రైట్ సోదరులకు...