AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీడు మనిషా.. డైనోసరా! భారీ కొండ చిలువను ఉప్పూకారం చల్లి.. కూరొండేశాడు.. వీడియో

ప్రపంచవ్యాప్తంగా రకరకాల సంస్కృతులు, రకరకాల ఆహార అలవాట్లు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో విభిన్న ఆహార ప్రాధాన్యతలు కలిగిన వ్యక్తులను పలుమార్లు సామాజిక మాధ్యమాల్లో చూసే ఉంటారు. ఎవడి గోల వాడిదని చూసిన వారంతా అనుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 12 అడుగుల కొండ చిలువను.. కూర వండేశాడు. అతను వండిన విధానం, అదీ చూస్తే కడుపుతో డోకు పుట్టేలా..

Viral Video: వీడు మనిషా.. డైనోసరా! భారీ కొండ చిలువను ఉప్పూకారం చల్లి.. కూరొండేశాడు.. వీడియో
Python Dish
Srilakshmi C
|

Updated on: Jul 07, 2024 | 6:38 PM

Share

ప్రపంచవ్యాప్తంగా రకరకాల సంస్కృతులు, రకరకాల ఆహార అలవాట్లు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో విభిన్న ఆహార ప్రాధాన్యతలు కలిగిన వ్యక్తులను పలుమార్లు సామాజిక మాధ్యమాల్లో చూసే ఉంటారు. ఎవడి గోల వాడిదని చూసిన వారంతా అనుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 12 అడుగుల కొండ చిలువను.. కూర వండేశాడు. అతను వండిన విధానం, అదీ చూస్తే కడుపుతో డోకు పుట్టేలా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఈ వీడియోలో ఓ సోషల్‌ మీడియా ఇన్‌ప్లుయెన్సర్‌ 12 అడుగుల కొండచిలువను.. ఏమాత్రం శుభ్రం చేయకుండా బాగా ఉప్పుకారం, మసాలా దట్టించి.. సలసల కాగే నూనెలో వేసి, డీప్‌ ఫ్రై చేయడం కనిపిస్తుంది. దీంతో పాము రంగు నారింజ నుంచి నలుపుకు మారడాన్ని వీడియోలో చూడొచ్చు. అనంతరం కొండచిలువ లోపలి పేగులను అయినా తొలగించాకుండా అలాగే ముక్కలు చేసి, రకరకాల కూరగాయలు వేసి కూర చేశాడు. దీనిని ఆహారం ప్లేట్‌లో వడ్డించుకుంటూ వీడియోలో కనిపించాడు.

ఇవి కూడా చదవండి

కొండచిలువ కూరొండిన పాత్రలో దాని పేగులను గరిటెతో వేసుకుంటున్న దృశ్యం చూసిన నెటిజన్లు బాబోయ్‌ వీడెవడో తేడాగా ఉన్నాడు.. కాస్త డాక్టర్‌కి చూపించడర్రా..! అంటూ గగ్గొలో పెడుతున్నారు. చూసేందుకే అంత అసహ్యంగా ఉంటే.. దానిని లొట్టలేసుకు తిన్న సదరు ఇన్‌ఫ్లుయెన్సర్‌ బతికున్నాడా.. పోయాడా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

మరికొందరు నెటిజన్లు ఇతగాడు వండిన వంటకాన్ని మెచ్చుకోకపోగా.. బాగా తిట్టిపోశారు. పాము మాంసంతో పాటు, దాని విషాన్ని కూడా వదలకుండా తింటున్నాడు.. వీడసలు మనిషేనా అని అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.