Viral: లక్ష చోరీ కేసులో పోలీసులకు చిక్కాడు.. అతగాడి హిస్టరీ తెల్సి పోలీసులే బిత్తరపోయారు

ఓ చోరీ కేసులో రోహిత్‌ కానుభాయ్‌ సోలంకి అనే వ్యక్తిని గుజరాత్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతగాడి క్రైమ్ హిస్టరీ చూసి పోలీసులే నిర్ఘాంతపోయారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Viral: లక్ష చోరీ కేసులో పోలీసులకు చిక్కాడు.. అతగాడి హిస్టరీ తెల్సి పోలీసులే బిత్తరపోయారు
Rohit Kanubhai Solanki
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 07, 2024 | 6:14 PM

ఓ ఇంట్లో నుంచి లక్ష రూపాయలు తస్కరించిన కేసులో రోహిత్‌ కానుభాయ్‌ సోలంకి వ్యక్తిని గుజరాత్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే అతన్ని విచారించగా మైండ్ బ్లాంక్ అయ్యే వివరాలు వెలుగులోకి వచ్చాయి. వివిధ రాష్ట్రాల్లో ఇతగాడికి ఓ రేంజ్ క్రైమ్ హిస్టరీ ఉంది. ఏకంగా 19 చోరీ కేసుల్లో అతడి నిందితుడిగా గుర్తించారు. ఏపీలో 2, తెలంగాణలోనూ 2 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దొంగతనం చేసిన సొత్తులో ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తుంటాడు. నైట్ క్లబ్‌లు, డ్యాన్స్ బార్‌లే అతని అడ్రస్. ఎప్పడూ అక్కడే తాగి తందనాలు ఆడుతూ ఉంటాడు. అయ్యాగారికి డ్రగ్స్ అలవాటు కూడా ఉంది.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటి అంటే దొంగతనాలు చేసి.. బాగానే సొమ్ము పోగు చేశాడు. ముంబైలో సోలంకికి కోటికి పైగా విలువ చేసే ప్లాట్స్ ఉన్నాయి. ఒక ఆడీ కారు కూడా ఉంది. అయ్యాగారు… దొంగతనాలు చేసేందుకు వివిధ రాష్ట్రాలకు ఫ్లైట్స్‌లోనే తిరుగుతాడు. లగ్జరీ హోటల్స్‌లో స్టే చేస్తాడు. పగలు రెక్కీ చేసి.. రాత్రిళ్లు తన చోరకళను ప్రదర్శిస్తాడు. ఇక ఓ ముస్లిం మహిళను ఇష్టపడి.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిందితుడు తన పేరు అర్హన్‌గా మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంత క్రైమ్ హిస్టరీ ఉన్న ఇతగాడు ఓ ఇంట్లో లక్ష చోరీ చేసిన కేసులో చిక్కినట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?