New Demat Accounts: జూన్‌లో 42.4 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు.. స్టాక్ మార్కెట్‌లోకి కొత్తవారు!

భారత్‌లో స్టాక్‌ మార్కెట్‌ బుల్‌ రన్‌ జోరందుకోవడంతో కొత్త డీమ్యాట్‌ ఖాతాలు వెల్లువెత్తుతున్నాయి. సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ (సిడిఎస్‌ఎల్), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డిఎల్) విడుదల చేసిన డేటా ప్రకారం జూన్ నెలలో 42.4 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు సృష్టించినట్లు డేటా ద్వారా తెలుస్తోంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో నెల వ్యవధిలో 40 లక్షలకు పైగా..

New Demat Accounts: జూన్‌లో 42.4 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు.. స్టాక్ మార్కెట్‌లోకి కొత్తవారు!
Demat Account
Follow us
Subhash Goud

|

Updated on: Jul 07, 2024 | 6:08 PM

భారత్‌లో స్టాక్‌ మార్కెట్‌ బుల్‌ రన్‌ జోరందుకోవడంతో కొత్త డీమ్యాట్‌ ఖాతాలు వెల్లువెత్తుతున్నాయి. సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ (సిడిఎస్‌ఎల్), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డిఎల్) విడుదల చేసిన డేటా ప్రకారం జూన్ నెలలో 42.4 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు సృష్టించినట్లు డేటా ద్వారా తెలుస్తోంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో నెల వ్యవధిలో 40 లక్షలకు పైగా డీమ్యాట్ ఖాతాలు తెరవడం ఇది నాలుగోసారి. ఈ మైలురాయిని డిసెంబర్ 2023, జనవరి, ఫిబ్రవరి 2024లో చేరుకుంది.

మేలో 36 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు సృష్టించబడ్డాయి. జూన్ 2023 నెలలో 23.6 లక్షల కొత్త ఖాతాలు ఓపెన్‌ కాగా, గతేడాదితో పోలిస్తే జూన్‌లో 34.66% ఎక్కువ డీమ్యాట్ ఖాతాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు సృష్టించిన డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2 కోట్లు. గత ప్రభుత్వం కొనసాగించడంతోపాటు ఆర్థిక విధానాలు కొనసాగుతాయని హామీ ఇవ్వడంతో పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారు. కొత్త డీమ్యాట్ ఖాతాల సృష్టికి ఇది ఒక కారణమైతే, స్టాక్ మార్కెట్ జోరందుకోవడం మరో కారణం. గత రెండు మూడేళ్లుగా మార్కెట్ అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ఈక్విటీ మార్కెట్‌పై ఇన్వెస్టర్ల రద్దీ పెరిగింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మరిన్ని డీమ్యాట్ ఖాతాల సృష్టికి అవకాశం ఉంది. ఐపీఓలకు మంచి స్పందన వస్తోంది. చాలా షేర్లు 50 శాతం కంటే ఎక్కువ విలువ వేగంగా పెరుగుతోంది. అదేవిధంగా కొత్త ఇన్వెస్టర్లు కూడా ఈక్విటీ వైపు ఆసక్తిగా మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత స్టాక్ మార్కెట్ 70,000 నుంచి 80,000కి పెరిగింది. మార్కెట్ రన్ చాలా గొప్పగా ఉంది. మార్కెట్ ఇలాగే కొనసాగితే డీమ్యాట్ ఖాతా సృష్టి వేగం కూడా కొనసాగే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి