AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj CNG Bike: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌.. మైలేజీ ఎంతో తెలుసా?

బజాజ్ ఆటో ఫ్రీడమ్ 125 బైక్‌ను విడుదల చేసింది. సిఎన్‌జితో నడిచే ప్రపంచంలోనే తొలి బైక్ ఇదే. ఈ సీఎన్‌జీ బైక్ ధర 95,000 రూపాయల నుండి 1.10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ బైక్‌ ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ వాహనాన్ని తయారు చేసేందుకు..

Bajaj CNG Bike: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌.. మైలేజీ ఎంతో తెలుసా?
Bajaj
Subhash Goud
|

Updated on: Jul 07, 2024 | 6:10 PM

Share

బజాజ్ ఆటో ఫ్రీడమ్ 125 బైక్‌ను విడుదల చేసింది. సిఎన్‌జితో నడిచే ప్రపంచంలోనే తొలి బైక్ ఇదే. ఈ సీఎన్‌జీ బైక్ ధర 95,000 రూపాయల నుండి 1.10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ బైక్‌ ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ వాహనాన్ని తయారు చేసేందుకు బజాజ్ చేసిన R&D ప్రయత్నాన్ని ఆయన అభినందించారు.

ఇది కూడా చదవండి: SIM Cards: ఒక వ్యక్తికి ఎన్ని సిమ్‌ కార్డులు ఉండాలి? పరిమితి కంటే ఎక్కువ ఉంటే జైలుకే..!

ఖరీదు కిలోమీటరుకు రూ.1 మాత్రమే:

బజాజ్ సీఎన్‌జీ బైక్ ఫ్రీడమ్ 125 ఆచరణలో ఎంత డబ్బు ఆదా చేయగలదో నితిన్ గడ్కరీ ఒక ఉదాహరణ ఇచ్చారు. ప్రస్తుత ధరల ప్రకారం.. పెట్రోల్ ద్విచక్రవాహనం ధర కిలోమీటరుకు రూ.2.25గా ఉంది. అయితే, సీఎన్‌జీ బైక్‌ ధర కిలోమీటరుకు ఒక్క రూపాయి మాత్రమే. ద్విచక్ర వాహనాల ఎగుమతిలో మేం నంబర్‌వన్‌. పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే సీఎన్‌జీ బైక్‌లకు ఎక్కువ మార్కెట్ లభిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని నితిన్ గడ్కరీ అన్నారు.

బైక్‌లో పెట్రోల్, సీఎన్‌జీ ట్యాంకులు

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్‌లో డ్యూయల్ ట్యాంక్ ఉంది. సీటు కింద రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంక్, రెండు కిలోల సీఎన్‌జీ ట్యాంక్ ఉన్నాయి. కిలో సీఎన్‌జీ ధర రూ.60. ఒక కిలో సిఎన్‌జితో ఈ బైక్ 106 కి.మీల దూరం నడపగలదని బజాజ్ కంపెనీ పేర్కొంది. పెట్రోల్ ట్యాంకుల స్థానంలో ఇథనాల్ ట్యాంకులను పెట్టాలని బజాజ్ ఆటోకు నితిన్ గడ్కరీ సూచించారు. పెట్రోల్ కంటే ఇథనాల్ పర్యావరణ అనుకూలమని వారు భావిస్తున్నారు. సిఎన్‌జి పెట్రోలియం ఉత్పత్తి అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే పర్యావరణానికి తక్కువ హానికరం.

ఇది కూడా చదవండి: Ambani Family Dance : మామూలుగా లేదుగా.. సంగీత కచేరిలో వేదికపై డ్యాన్స్‌తో అదరిగొట్టిన అంబానీ ఫ్యామిలీ

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి