AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: ఈ చిన్న ట్రిక్‌తో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే.. మార్కెట్‌లో ఏ తోపు కూడా నీ లాభాలు ఆపలేడు

ఇంట్రాడే ట్రేడింగ్‌లో స్టాక్స్‌ను ఎలా ఎంచుకోవాలో బిజినెస్ నిపుణులు వివరిస్తున్నారు.బిగినర్స్‌కు వాల్యూమ్, లిక్విడిటీ ఉన్న స్టాక్‌లను ఎంచుకోవాలని సూచించారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 30, నిఫ్టీ 50లోని కంపెనీలు అనుకూలమైనవని, ప్రీ-ఓపెన్ మార్కెట్‌లో టాప్ గెయినర్‌లను గుర్తించడం ముఖ్యమని తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయ్.

Stock Market: ఈ చిన్న ట్రిక్‌తో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే.. మార్కెట్‌లో ఏ తోపు కూడా నీ లాభాలు ఆపలేడు
Stocks
Ravi Kiran
|

Updated on: Mar 05, 2026 | 1:49 PM

Share

ఇంట్రాడే ట్రేడింగ్ మార్కెట్‌లోకి ప్రతిరోజూ వేలాది మంది కొత్త ట్రేడర్‌లు ప్రవేశిస్తున్నారు. వీరికి ఏ స్టాక్‌లను ఎంచుకోవాలో, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అనే విషయాలపై స్పష్టత ఉండదు. ఈ అంశాలపై బిజినెస్ నిపుణులు కీలక సలహాలు అందించారు. కొత్త ట్రేడర్‌లు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత సరైన మార్గదర్శకత్వం లేక గందరగోళానికి గురవుతారని, అటువంటి వారికి సరైన స్టాక్ ఎంపిక విధానం చాలా ముఖ్యమని వాళ్లు అన్నారు.

ఇంట్రాడే ట్రేడింగ్‌కు స్టాక్ ఎంపికలో ప్రధాన పారామీటర్‌గా వాల్యూమ్‌ను చూడాలన్నారు. వాల్యూమ్ అంటే కొనాలన్నా, అమ్మాలన్నా సులువుగా జరిగే లిక్విడిటీ అని అర్థం. మార్కెట్ పెరిగినా, తగ్గినా వాల్యూమ్ ట్రేడ్ కావాలి. మిలియన్స్, క్రోర్స్, లక్షల సంఖ్యలో జరిగే పెద్ద వాల్యూమ్ ఉన్న కంపెనీలను ఇంట్రాడే కోసం ఎంచుకోవాలి. వాల్యూమ్ ఎక్కువగా ఉండే స్టాక్‌లను గుర్తించడానికి, బీఎస్‌ఈ వెబ్‌సైట్‌లోని సెన్సెక్స్ 30 కంపెనీలు, నిఫ్టీ 50 కంపెనీలను పరిశీలించాలని సిఫార్సు చేశారు. ఈ 30, 50 కంపెనీలు మార్కెట్‌లో అధిక లిక్విడిటీ, వాల్యూమ్‌ను కలిగి ఉంటాయని, ఇవి మార్కెట్ ఇంజిన్ల వంటివని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకునే వారు ఈ కంపెనీల నుంచి స్టాక్‌లను ఎంచుకోవచ్చు.

స్టాక్‌లను ఎంపిక చేసుకునే విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చారు. మార్కెట్ ఉదయం 9:15 గంటలకు ఓపెన్ అయినప్పటికీ, 9:00 గంటలకు ప్రీ-ఓపెన్ మార్కెట్ ఉంటుందని తెలిపారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌కు వెళ్లి, 9:00 గంటలకు ప్రీ-ఓపెన్ మార్కెట్‌లో గ్రీన్(పాజిటివ్) రంగులో ఉన్న స్టాక్‌లను గమనించాలి. ఏవైతే టాప్ గెయినర్‌లుగా ఉంటాయో వాటిని రాసుకోవాలని సూచించారు. ఉదాహరణకు, ఒకరోజు టాటా స్టీల్ 9:00 గంటలకు టాప్ గెయినర్‌గా ఉంటే, 3:30 గంటల వరకు కూడా అదే స్థానంలో ఉండే అవకాశం ఉందని ఆయన ఉదాహరించారు.

9:15 తర్వాత ఈ స్క్రిప్ట్‌లను పరిశీలించడం, అలాగే రోజు చివరి వరకు వాటి కదలికలను గమనించడం ద్వారా ట్రేడర్‌లు అనుభవాన్ని పొందుతారు. ప్రీవియస్ క్లోజ్, ఓపెనింగ్ ప్రైస్, లో ప్రైస్‌లను పరిశీలించడం ద్వారా స్టాక్ కదలికలను అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, టాటా స్టీల్ నిన్న రూ. 1103.50 వద్ద క్లోజ్ అయితే, ఈరోజు రూ. 1124 వద్ద ఓపెన్ అయ్యి, రూ. 1115.35 లోకి వచ్చిందని వివరించారు. ఈ కదలికలను అర్థం చేసుకోవడం ట్రేడింగ్‌కు ముఖ్యమని తెలిపారు. ఎంటర్ అవ్వడం, ఎగ్జిట్ అవ్వడం, స్టాప్ లాస్ పెట్టడం వంటివి ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లలో సులువుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద, అధిక వాల్యూమ్ ఉన్న, ప్రముఖ కంపెనీల స్టాక్‌లను పరిశీలించడం, ప్రీ-ఓపెన్ మార్కెట్‌లో వాటి పనితీరును గమనించడం ద్వారా బిగినర్‌లు ఇంట్రాడే ట్రేడింగ్‌లో విజయవంతంగా స్టాక్‌లను ఎంచుకోవచ్చని తెలిపారు.

గమనిక: స్టాక్ మార్కెట్ రిస్క్‌తో కూడుకున్నవి.. మీరు ట్రేడ్ లేదా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కచ్చితంగా బిజినెస్ అడ్వైజర్‌ను సంప్రదించండి.  

ఇది చదవండి: సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్తే.. టీమిండియాకు శనిలా అతిపెద్ద రెండు గండాలు

Follow Us