SBI home loans: మీ సొంతింటి కలను సాకారం చేసే స్కీమ్ ఇది.. అతి తక్కువ వడ్డీ.. సులభంగా ప్రాసెసింగ్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హోమ్ లోన్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ప్రకటించింది. ఆ రుణాలపై రూ.8.50 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. దాదాపు 30 ఏళ్ల పాటు రుణాన్ని చెల్లించే అవకాశం కల్పించింది. దీనితో పాటు ఆస్తి ఖర్చులో 90 శాతం వరకూ రుణంగా మంజూరు చేస్తుంది. రక్షణ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, జీతం లేని వ్యక్తులు, గ్రీన్ గృహాలను కొనుగోలు చేసేవారు, కొండలు, గిరిజన ప్రాంతాల నివాసించే వారికి ప్రత్యేక గృహ రుణాలను అందజేస్తుంది.

SBI home loans: మీ సొంతింటి కలను సాకారం చేసే స్కీమ్ ఇది.. అతి తక్కువ వడ్డీ.. సులభంగా ప్రాసెసింగ్..
Home Loan
Follow us

|

Updated on: Jul 07, 2024 | 6:25 PM

సొంతిల్లు సమకూర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. దాని సాకారం చేసుకోవడానికి సాధారణంగా బ్యాంకులపై ఆధారపడతారు. అవి మంజూరు చేసే రుణాలతో ఇళ్లు, ఫ్లాట్లను కొనుగోలు చేసుకుంటారు. రుణాలను తీర్చడానికి ఈఎమ్ఐ ల రూపంలో నెలవారీ సులభ వాయిదాలు చెల్లించే అవకాశం ఉంటుంది. వివిధ బ్యాంకులు తమ ఖాతాదారులకు హోమ్ లోన్లను విరివిరిగా మంజూరు చేస్తున్నాయి. వాటి వడ్డీ రేట్లు ఆయా బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర నిబంధనలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వడ్డీరేటు తక్కువగా ఉండడంతో పాటు నిబంధనలు సులువుగా ఉన్న బ్యాంకులను ఎంచుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.

ఎస్బీఐలో ఆకర్షణీయమైన వడ్డీరేట్లు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హోమ్ లోన్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ప్రకటించింది. ఆ రుణాలపై రూ.8.50 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. దాదాపు 30 ఏళ్ల పాటు రుణాన్ని చెల్లించే అవకాశం కల్పించింది. దీనితో పాటు ఆస్తి ఖర్చులో 90 శాతం వరకూ రుణంగా మంజూరు చేస్తుంది. రక్షణ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, జీతం లేని వ్యక్తులు, గ్రీన్ గృహాలను కొనుగోలు చేసేవారు, కొండలు, గిరిజన ప్రాంతాల నివాసించే వారికి ప్రత్యేక గృహ రుణాలను అందజేస్తుంది.

ప్రయోజనాలు..

స్టేట్ బ్యాంకులో హోమ్ లోన్లు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రుణం తొందరగా మంజూరు చేయడంతో పాటు వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. తద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.

ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం.. వినియోగదారులు మిగులు నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకునే సౌలభ్యాన్ని కల్పించింది.

వడ్డీ రేట్లు.. గృహ రుణాలపై వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఖాతాదారులకు ప్రయోజనం కలుగుతుంది.

తక్కువ ప్రాసెసింగ్ ఫీజు.. రుణాలను మంజూరు చేసేందుకు ప్రాసెసింగ్ చాలా సులభంగా ఉంటుంది. అలాగే ఫీజు కూడా తక్కువగా వసూలు చేస్తారు.

అదనపు ఖర్చులు లేవు.. ఎస్బీఐలో లావాదేవీలు చాలా పారదర్శకంగా జరుగుతాయి. ఎటువంటి అదనపు ఖర్చులు ఉండవు. ముఖ్యంగా హిడెన్ చార్జీలు వసూలు చేయరు.

ముందస్తు చెల్లింపుపై పెనాల్టీ లేదు.. రుణగ్రహీతలు తమ రుణాన్ని ముందస్తుగా చెల్లించవచ్చు. దీని కోసం ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయరు. ముందస్తు చెల్లింపుల ద్వారా వడ్డీ భారం తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

24 వేల శాఖలు.. ఎస్బీఐకి దేశ వ్యాప్తంగా 24 వేల శాఖలు ఉన్నాయి. ఖాతాదారులకు 1,600 మంది కంటే ఎక్కువ సభ్యులు సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా హోమ్ లోన్ల మంజూరులో సులభ నిబంధనలు అమలు చేస్తున్నారు.

హోమ్ లోన్ కాలిక్యులేటర్.. ఎస్బీఐ హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ ఖాతాదారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. నెలవారీ ఈఎమ్ఐలు, లోన్ వ్యవధిలో చెల్లించాల్సిన వడ్డీ తదితర వివరాలు తెలుసుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా హోమ్ లోన్లపై 8.50 నుంచి 9.85 శాతం వరకూ వడ్డీని వసూలు చేస్తుంది. ఆస్తి విలువలో దాదాపు 90 శాతం వరకూ రుణంగా మంజూరు చేస్తుంది. రుణ చెల్లింపు కాల పరిమితి 30 ఏళ్ల వరకూ ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఛార్జీగా రుణం మొత్తంలో 0.35 శాతం (రూ. 2 వేల నుంచి రూ.పదివేలు) మాత్రమే చెల్లించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
బడ్జెట్ ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్ జోరు.. గత పదేళ్ల రికార్డు
బడ్జెట్ ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్ జోరు.. గత పదేళ్ల రికార్డు
WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
ఈ బడ్జెట్ ఎందుకు ప్రత్యేకం? ఈ రంగాలపై భారీ అంచనాలు..
ఈ బడ్జెట్ ఎందుకు ప్రత్యేకం? ఈ రంగాలపై భారీ అంచనాలు..
ఢిల్లీకి జగన్.. 3 రోజుల పాటు అక్కడే...
ఢిల్లీకి జగన్.. 3 రోజుల పాటు అక్కడే...
సొంతింటి కల నెరవేరేదెలా? గృహ నిర్మాణానికి బడ్జెట్ లో ప్రకటన.?
సొంతింటి కల నెరవేరేదెలా? గృహ నిర్మాణానికి బడ్జెట్ లో ప్రకటన.?
మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? ఆశ పడ్డారో అంతే సంగతులు..
మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? ఆశ పడ్డారో అంతే సంగతులు..
ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్‌‌ పై ఉత్కంఠ
ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్‌‌ పై ఉత్కంఠ
నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..?ఇందులో కొవ్వుశాతం జీరో
నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..?ఇందులో కొవ్వుశాతం జీరో
హైదరాబాదీలకు ఇంట్లో భోజనం కన్నా.. పొరుగు హోటల్ బిర్యానీయే మిన్న!
హైదరాబాదీలకు ఇంట్లో భోజనం కన్నా.. పొరుగు హోటల్ బిర్యానీయే మిన్న!